Saturday, November 16, 2024

అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రస్తుత సమాజంలో మహిళలను బలిగొంటున్న భూతం వరకట్నం. కట్నం ఎంత ఎక్కువ ఇచ్చినప్పటికి అధనపు కట్నం కోసం వివాహితులైన మహిళలను వేధిస్తూ వారి ప్రాణాలను తీస్తున్నారు. అదనపు కట్న వేధింపులు తాలలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంద్రప్రదేశ్ లోని ఉరవకొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉరవకొండ సివివి నగర్ కు చెందిన వినోద్ సాఫ్టవేర్ ఇంజనీర్. బక్కరాయసముద్రానికి చెందిన శిరీష తో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర వయసున్న బాలుడున్నాడు.

పెళ్లి సమయంలో శిరీష తల్లిదండ్రులు కట్నం కింద 20 తులాల బంగారం, లక్ష నగదు, 5 సెంట్ల స్థలాన్ని శిరీష పేరు మీద రాసిచ్చారు. దీంతో తృప్తి చెందక వినోద్ కుటుంబం అదనపు కట్నం కోసం శిరీషను వేధించసాగారు. వేధింపులు బరించలేక ఇంట్లోనే ఉరేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుర్తించిన భర్త స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కూతురు చనిపోయిన విషయం తెలుసుకున్న శిరీష తల్లిదండ్రులు, బందువులు ఆందోళనకు దిగారు. అత్తింటి వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపించారు. 5 సెంట్ల స్థలాన్ని తన పేరుమీద రాయాలని వేధించేవాడన్నారు. మృతురాలి సోదరుడు శివ ప్రసాద్ ఫిర్యాదుమేరకు పోలీసులు భర్త, అత్తతో పాటు మరో ముగ్గురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News