Tuesday, November 5, 2024

కాంగ్రెస్‌కు వేసి ఓట్లు వృధా చేయవద్దు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: కాంగ్రెస్‌కు ఓటు వేసి ఓట్లను వృధా చేయవద్దని, అందుకు బదులుగా ఆప్‌కి ఓటు వేసి గెలిపించాలని సోమవారం ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను అభ్యర్థించారు. అహ్మదాబాద్ లోని విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి, ఆప్‌కి మధ్య ప్రత్యక్ష పోటీ జరుగుతోందని డిసెంబర్ 1,5 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ 182 స్థానాలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం నాలుగైదు స్థానాలు మాత్రమే వస్తాయని పేర్కొన్నారు.గుజరాత్‌లో 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉందని, ఈసారి ఆప్ కచ్చితంగా గట్టి పోటీ ఇచ్చి గెలుస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ తన ప్రాబల్యం కోల్పోతోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే గుజరాత్‌లో 178 స్థానాల్లో ఆప్ తన అభ్యర్థుల పేర్లను ప్రకటించిందని, కాంగ్రెస్ ఓట్ల శాతం 13 శాతానికి పడిపోతుందని, అందువల్ల కాంగ్రెస్‌కు ఓటు వేయాలనుకుంటున్న వారంతా ఇలా చేసి మీ ఓటును వృధా చేయొద్దని సూచించారు. 27 ఏళ్లుగా బీజేపీ పాలనతో ప్రజలు విసుగెత్తినప్పటికీ కాంగ్రెస్‌పై ద్వేషంతో చేసేది లేక అధికార పార్టీకి ఓటు వేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు బరిలోకి దిగుతున్న ఆప్‌పై ప్రజల్లో కొత్త ఆశ చిగురించి తమకే ఓటు వేస్తారని ధీమాగా చెప్పారు.

Gujarat Election: People should not waste vote says Kejriwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News