Saturday, November 23, 2024

48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేము

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నారు. అయితే సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ నటుడు నరేశ్ కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. “గుండెపోటు, శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కృష్ణను ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేర్పించాము. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయినప్పటికీ 48 గంటలు గడిస్తేగానీ పూర్తిగా ఏమీ చెప్పలేము. మంగళవారం మధ్యాహ్నం కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు పూర్తిగా చెబుతారు” అని అన్నారు.

ఇక, కృష్ణ కుమారుడు మహేష్‌బాబు సహా కూతుళ్లు, కుటుంబ సభ్యులు అందరూ కాంటినెంటల్ ఆసుపత్రి దగ్గరే ఉన్నారు. ఎప్పటికప్పుడు కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడుతూ చికిత్స గురించి తెలుసుకుంటున్నారు.

Doctors about Super Star Krishna health condition

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News