Monday, December 23, 2024

కిడ్నాప్ కలకలం.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఆప్ అభ్యర్థి..

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాలా కిడ్నాప్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమైన కంచన్… నేడు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి తన నామినేషన్ ఉపసంహరించుకోవడం గమనార్హం. సూరత్ (తూర్పు) నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాలా కన్పించట్లేదంటూ బుధవారం ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ ఉపసంహరించుకునేలా ఆయనపై బీజేపీ ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు.

నామినేషన్ పత్రాల పరిశీలన కోసం కంచన్ మంగళవారం మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వస్తుండగా కొందరు బీజేపీ వ్యక్తులు ఆయనను బలవంతంగా తీసుకెళ్లారంటూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆప్ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. బీజేపీనే ఆయనను కిడ్నాప్ చేసి ఉంటుందని ఆప్ నేతలు మండిపడ్డారు. దీంతో ఇది కాస్త తీవ్ర దుమారానికి దారి తీసింది. అయితే కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే కంచన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రావడం గమనార్హం. అనంతరం ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఒకింత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆప్, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

AAP Surat Candidate withdraws Nomination

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News