Saturday, December 21, 2024

మీర్ పేటలో వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ వివాహితను కానిస్టేబుల్ లైంగికంగా వేధించాడు. ఆమె లొంగకపోవడంతో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి అనంతరం పాత కేసు ఉపసంహరించుకోకపోతే నగ్న చిత్రాలు, వీడియోలు షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కామాంధుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో పరిధిలో పి వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ నివసిస్తున్నాడు. సదరు కానిస్టేబుల్ భార్యకు మరో వివాహిత పరిచయమైంది.

ఇద్దరు స్నేహితులుగా ఉండేవారు. వెంకటేశ్వర్ల కన్ను ఆ వివాహితపై పడింది. ఆమెను లైంగికంగా వేధించడంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మళ్లీ ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలు తన కుటుంబంతో కలిసి సికింద్రాబాద్‌కు మకాం మార్చింది. అక్కడ నుంచి మీర్‌పేటకు మారారు. వెంకటేశ్వర్లు జైలు నుంచి విడుదలైన తరువాత ఆమె అడ్రస్సు తెలుసుకున్న కానిస్టేబుల్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు, చిత్రాలు తీశాడు. పాత కేసు ఉపసంహరించుకోకపోతే వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని చెప్పడంతో ఆమె మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News