Monday, December 23, 2024

దంపతులు అనుమానాస్పదస్థితిలో మృతి

- Advertisement -
- Advertisement -

నాగిరెడ్డి పేట: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట శివారులో దంపతులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. నాగిరెడ్డి పేట శివారులో కోళ్ల పారం వద్ద దంపతులు కాపలాగా ఉన్నారు. కోళ్ల ఫారంలో పడుకున్న చోటనే యేసయ్య, సాయవ్వలు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దంపతుల మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఫుడ్ పాయిజన్ కావడంతో చనియారా?, ఎవరైనా చంపేశారా?, ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోళ్ల ఫారం నుంచి వచ్చిన దుర్వాసనతో ఊపిరాడకపోవడంతో మృతి చెందారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News