- Advertisement -
నోయిడా : ఉక్రెయిన్ యుద్ధ కొనసాగుతోన్న వేళ.. రష్యాపై పాశ్చాత్య దేవాలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్ మాత్రం చౌకలో లభిస్తోన్న ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు ధరపై జి 7 కూటమి పరిమితిని ప్రతిపాదించింది.
అయినప్పటికీ భారత్ ఎటువంటి ఒత్తిడికి గురికావడం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి భయాందోళనలు లేవు. సరఫరాలో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని ఎదుర్కోడానికి సిద్ధంగానే ఉన్నాం అని ఆయన అన్నారు. గ్రేటర్ నోయిడాలో జరుగుతోన్న వరల్డ్ ఎల్‌పీజీ వీక్ 2022లో పాల్గొన్న ఆయన , రష్యా ఇంధన దిగుమతిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
- Advertisement -