Saturday, November 23, 2024

మిషన్ ప్రారంభ్ విజయవంతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష అంకుర పరిశ్రమ “స్కైరూట్ ఏరోస్పేస్‌” తమ మొట్టమొదటి రాకెట్ విక్రమ్‌ఎస్ లేదా విక్రమ్1ను నింగిలోకి విజయవంతంగా పంపించింది. చెన్నైకు 115 కిమీ దూరంలో శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ ) ఈ రాకెట్‌ను ప్రయోగించింది. భారత అంతరిక్ష కార్యక్రమాలకు ప్రైవేట్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం 2020 లోనే ఆహ్వానించిన తరువాత స్కైరూట్ మొట్టమొదటి సంస్థగా రెక్క లు విప్పింది.

అంతకుముందు ఈనెల 15 వ తేదీనే ఈ ప్రయోగానికి నిర్ణయమైనప్పటికీ వాతావరణం అనుకూలించక పోవడంతో శుక్రవారానికి మారింది. శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 81 కిలోమీటర్ల ఎత్తుకు నింగి లోకి విక్రమ్ ఎస్ దూసుకెళ్లింది. దీని పొడవు 6 మీటర్లు కాగా, బరువు 545 కిలోలు. ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను కక్షలోకి తీసుకెళ్లింది. వాటిలో భారత్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ అయిన ఫన్-శాట్‌, చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్‌ ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News