Saturday, November 16, 2024

ఓటర్ల జాబితా నుంచి ఆజం ఖాన్ పేరు తొలగింపు

- Advertisement -
- Advertisement -

బరేలి: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ పేరును ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రామ్‌పూర్ ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు గురువారం తెలిపారు. 2019 నాటి విద్వేష ప్రసంగం కేసులో ఆయన దోషి అని తేలిన కొన్ని వారాలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఆయన డిసెంబర్ 5న జరిగే ఉప ఎన్నికలో రామ్‌పూర్ సదర్(అర్బన్) నుంచి తన ఓటును వేయలేరు.
జాబితా నుంచి ఆయన పేరును తొలగించాలని రామ్‌పూర్ ఎలెక్టొరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్‌ఓ) తీసుకున్నారు. బిజెపి ఉప ఎన్నికలలో పోటీచేస్తున్న బిజెపి అభ్యర్థి ఆకాశ్ సక్సేనా ఫిర్యాదు చేయడం, ఆయన పేరును తొలగించేందుకు వివిధ అంశాలు పేర్కొనడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. “సక్సేనా సమర్పించిన దరఖాస్తు, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, కోర్టు తీర్పు/ఉత్తర్వును పరిశీలించిన పిదప ముహమ్మద్ ఆజం ఖాన్ పేరును కొట్టివేయడం సరైనదే” అని ఈఆర్‌ఓ పేర్కొంది. దాని తర్వాత వెంటనే 37రాంపూర్ విధాన్‌సభ, క్రమసంఖ్య 333ను వెంటనే తొలగించాం అని పేర్కొంది. గత నెల విద్వేష ప్రసంగం కేసులో రాంపూర్ ఎంఎల్‌ఏ ఖాన్‌ను అనర్హుడిగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News