Monday, December 23, 2024

బయోపిక్‌లో వాజ్‌పేయిగా పంకజ్ త్రిపాఠీ

- Advertisement -
- Advertisement -

 

ముంబై : మాజీ ప్రధాని , కవిగా కూడా పేరొందిన అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా సినిమా రాబోతోంది. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠీ ఈ బయోపిక్‌లో వాజ్‌పేయి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ‘ మై రహూ యా నా రహూ, యే దేశ్ రెహ్నా ఛాయియే అటల్ అనే పేరు పెట్టారు. ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహిస్తారు. ఇంతకు ముందు ఆయన ప్రముఖ మరాఠీ సినిమాలు నట్‌రంగ్, బాలక్ పాలక్, బాలగంధర్వ, టైమ్‌పాస్ వంటి పలు సినిమాలు తీశారు.

వాజ్‌పేయిపై బయోపిక్ రాబోతోందని చాలా కాలం క్రితమే ప్రకటన వెలువడింది. అప్పటి నుంచి ప్రధానమైన వాజ్‌పేయి పాత్రలో ఎవరు నటిస్తారు? అనేది కీలక ప్రశ్నగా నిలిచింది. ఈ సినిమాకు రచన ఉత్కర్ష్ నైతాని, వచ్చే సంవత్సరం క్రిస్మస్ రోజున వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా ఈ సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేశారు. ఉల్లేక్ ఎన్‌పి రాసిన అన్‌టోల్డ్ వాజ్‌పేయి అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలకు నటుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News