Monday, December 23, 2024

పురుషులు, మహిళలతో పోటీ పడలేం

- Advertisement -
- Advertisement -

 

తమకు ప్రత్యేకంగా ఈవెంట్‌లు నిర్వహించాలి
డిజిపి పేరిట ట్రాన్స్ జెండర్ల వినతిపత్రం

హైదరాబాద్: కానిస్టేబుల్ పరీక్షకు క్వాలిఫై అయిన ఐదుగురు ట్రాన్స్ జెండార్స్ అభ్యర్థులతో కలిసి తెలంగాణ హిజ్రా అండ్ ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం నాడు లక్టికాఫూల్‌లోని డిజిపి కార్యాలయంలో ఉన్నతాధికారులను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు పోరాటాలు చేస్తేనే అర్హత పరీక్ష ఎంపికలో ట్రాన్స్ జెండర్లకు అవకాశం వచ్చిందన్నారు.

అయితే ఇప్పుడు నిర్వహిస్తున్న ఈవెంట్ పోటీలలో ఎంపిక ప్రమాణాలు సరిగ్గా లేవన్నారు. పురుషులు, మహిళలతో తాము పోటీ పడలేమని , ఈ కారణంగా తమకు ( ట్రాన్స్ ఎండర్లకు) ప్రత్యేకంగా ఈవెంట్‌లు నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ఈ విషయంపై డిజిపి మహేందర్ రెడ్డి కార్యాలయంలో ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. డిజిపి మహేందర్ రెడ్డి నుండి సరైన స్పందన రాకపోతే తాము హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News