Monday, December 23, 2024

క్రిస్మస్ సందర్భంగా అవార్డులకు… కైస్తవులు, క్రైస్తవ సంస్థల నుండి దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ / హైదరాబాద్ : క్రిస్మస్ 2022 వేడుకల సందర్భంగా క్రైస్తవులకు, క్రైస్తవ సంస్థలకు అవార్డులు ప్రకటించేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. సామాజిక సేవ, విద్య, వైద్య, సాహిత్యం, కళలు, క్రీడలు మొదలగు వాటిలో విశేషంగా సేవలందించిన క్రైస్తవ వ్యక్తులు, సామాజిక సేవ, విద్య, వైద్య రంగాలలో విశేష సేవలందించిన క్రైస్తవ సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్దేశిత నమూనాలో ఈ నెల 20 నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు క్రిస్టియన్ మైనారిటీ ఆర్థిక సంస్థ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు లను ఆయా జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి కార్యాలయంలో డిసెంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాలను మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సంస్థ, ఖైరతాబాద్, హైదరాబాద్ కార్యాలయంలో స్వయంగా గాని, లేదా www.tscmfc.in వెబ్ సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని కాని పొందవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News