Monday, November 18, 2024

అర్వింద్ ఇంటిపై దాడి

- Advertisement -
- Advertisement -

అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం గవర్నర్ తమిళిసై సీరియస్ నివేదిక ఇవ్వాలంటూ డిజిపికి ఆదేశం
టిఆర్‌ఎస్ శ్రేణులపై అర్వింద్ తల్లి ఫిర్యాదు ఎనిమిది మంది కవిత అనుచరులపై
నాన్ బెయిలబుల్ వారెంట్ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : సివి ఆనంద్

 

మన తెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ బి జెపి ఎంపి ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేసి న వారిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఈ దాడికి సంబంధించి మొత్తం 8 మం దిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో టిఆర్‌ఎస్ నేతలు రాజా, రామ్ యాదవ్, టిఆర్‌ఎస్‌వి నేత స్వామి ఉన్నారు. నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ ఇంటిపై టిఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని అరవింద్ నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నిచర్ ను టిఆర్‌ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. అంతేకాదు అర్విం ద్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఎంపి అర్వింద్ ఇంటి ముట్టడికి వెళ్లి న టిఆర్‌ఎస్ కార్యకర్తలను నగర పోలీసులు ఆడుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తు తం అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆందోళన చేసిన వారిలో సుమారు 30 మందిని పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహి ల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టే షన్‌లకు తరలించారు. ఇంటిపై దాడి జరిగిన సమయంలో ఎంపి అర్విం ద్ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌లో కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో ఉన్నారు. దాడి నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎంపి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎంఎల్‌సి కవితపై ఎంపి ధర్మపురి అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇటీవల ఎంపి అరవింద్ మాట్లాడుతూ కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు ఎంపీ ఇంటి వద్దకు వెస్ట్‌జోన్ డిసిపి జోయల్ డేవిస్ వచ్చి దాడికి సంబందించిన విషయాలను తెలుసుకున్నారు.

తమిళిసై సీరియస్..

బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టిఆర్‌ఎస్ శ్రేణుల దాడిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖండించారు. అంతేకాకుండా ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా డిజిపిని గవర్నర్ ఆదేశించారు. ఇంట్లో వస్తువులను పగులగొట్టడం, కుటుంబ సభ్యులను బెదిరించడం చట్ట విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఆమె పేర్కొన్నారు.

పోలీసులకు ఎంపి తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు

అంతకు ముందు తమ ఇంటిపై టిఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేయడంపై బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ తల్లి విజయలక్ష్మీ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిఆర్‌ఎస్‌కు చెందిన 50 మంది గూండాలు తమ ఇంటిపై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి గేటు పగులగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టిఆర్‌ఎస్ జెండాలతో, కర్రలతో, రాళ్లతో దాడి చేశారని పిర్యాదులో పేర్కొన్నారు. ఘటనలో ఇంట్లో పనిచేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డ్ రమణ గాయపడ్డారని తెలిపారు. బెంజ్ కారు అద్దాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 మంది టిఆర్‌ఎస్ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. దాడికి దిగడమే కాకుండా తనను బెదిరించారని విజయలక్ష్మీ సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై విజయలక్ష్మీ మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ లేనిది చూసి దాడి చేయడం తప్పని, విమర్శలు చేస్తే ఇంటిపై దాడులు చేస్తారా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దాడులకు భయపడేది లేదని విజయలక్ష్మీ పేర్కొన్నారు.

తెలంగాణ భవన్ ముట్టడికి బిజెపి యత్నం

నిజామాబాద్ ఎంపి అరవింద్ ఇంటిపై టిఆర్‌ఎస్ దాడిని నిరసిస్తూ తెలంగాణ భవన్ ముట్టడికి వెళ్తున్న బిజెపి కార్యకర్తలను నాంపల్లి వద్ద పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితపై వ్యాఖ్యలను నిరసిస్తూ నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ నివాసంపై శుక్రవారం టిఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిని నిరసిస్తూ తెలంగాణ భవన్ వద్దకు ర్యాలీగా వెళ్లిన బిజెపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు పోలీస్ కమాండ్ కంట్రొల్ వద్ద హైదరాబాద్ సిపి సివి ఆనంద్‌ను కలిసి బిజెపి నేతలు వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ ఎంపి అరవింద్ నివాసంపై దాడి చేసిన టిఆర్‌ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని బిజెపి నేత చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

చర్యలు తీసుకుంటాం : సిపి సివి ఆనంద్ హామీ

కాగా, ఎంపి అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తనను కలిసిన బిజెపి నేతలకు హామీనిచ్చారు. అర్వింద్ ఇంటిపై దాడి చేయడమే కాకుండా అర్వింద్ తల్లిని బెదిరించారని సదరు వినతిపత్రలో బిజెపి నేతలు పేర్కొన్నారు. తగు చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని వినతిపత్రలో బిజెపి నేతలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News