Friday, December 20, 2024

దేశం లోనే పొడవైన వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై వారానికి రెండుసార్లు

- Advertisement -
- Advertisement -

 

గువాహతి : అస్సాం నుంచి తమిళనాడు వరకు ప్రయాణించే దేశం లోనే అత్యంత పొడవైన వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలును వారానికి రెండుసార్లు నడుపుతారు. నవంబర్ 22 నుంచి ఈ రైలు అందుబాటు లోకి వస్తుందని నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్) శనివారం వెల్లడించింది. డిబ్రుగర్‌ కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలును శనివారం జెండా ఊపి ప్రారంభించారు.

ఇది తొమ్మిది రాష్ట్రాల మీదుగా 80 గంటల పాటు 4189 మైళ్లు ప్రయాణిస్తుంది. ట్రయిన్ నెం. 15906 (డిబ్రుగర్ కన్యాకుమారి) వివేక్ ఎక్స్‌ప్రెస్ ఇదివరకు శనివారం నాడు మాత్రమే ప్రయాణించేది. ఇప్పుడు నవంబర్ 22 నుంచి ప్రతీ మంగళవారం నడుస్తుందని ఎన్‌ఎఫ్‌ఆర్ ప్రకటించింది. అలాగే ట్రయిన్ నెం. 15905 (కన్యాకుమారి డిబ్రుగర్ ) వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం గురువారాలు మాత్రమే నడుస్తుంది. ఇకపై నవంబర్ 27 నుంచి ప్రతి ఆదివారం నడుస్తుందని ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News