- Advertisement -
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ కంపెనీలో కొంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు శనివారం ధ్రువవీకరించింది. టెక్, కేటలాగ్, మార్కెటింగ్ రంగంలోని కొందరిని తొలగించనుంది. కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో నాలుగుశాతం మందిని తొలగించేందుకు జొమాటో యోచిస్తోంది. జొమాటో వ్యవస్థాపకుడు, సిఇఒ దీపిందర్ గోయల్ కొన్నిరోజుల క్రితమే పనితీరు సమర్థంగా లేని ఉద్యోగులను తొలగిస్తామని సూచించారని సమాచారం. కాగా జొమాటో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా, ఇనిషియేటివ్స్ హెడ్ రాహుల్ గంజూ, ఇంటర్‌సిటీ హెడ్ సిద్ధార్థ్ రాజీనామా చేయడంతో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఆందోళన నెలకొంది.
- Advertisement -