Monday, December 23, 2024

ధాన్యం కొండ దేశానికే అండ

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్:  ధాన్యపు రాసుల కొండతో తెలంగాణ రాష్ట్రం స్పల్పకాలంలోనే ఆహారోత్పత్తుల్లో దేశానికే అండగా నిలిచింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 44.40లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండేది. రాష్ట్రం ఏ ర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయరంగంలో తీసుకున్న శ్రద్ద, పట్టువదలకుండా నీటిపారుదల రంగంలో సాధించిన అధ్భుత ప్రగతితో ధాన్యం ఉత్పత్తుల్లో జాతీయ స్థాయిలోనే మెచ్చదగ్గ ఫలితాలు రాబట్టగలిగారు. రాష్ట్రంలో 2020-21నాటికి కోటి 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో జాతీయ స్థాయిలో 10వ స్థానంలో ఉన్న తెలంగాణను నాలుగవ స్థానంలో నిలబెట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యండ్ బుక్ ద్వారా దేశంలో ధాన్యం ఉత్పత్తికి సంబంధించి అన్ని రాష్ట్రాల వివరాలను విడుదల చేసింది. ఇందులో పశ్చిమ బెంగాల్ 1.65కోట్ల మెట్రిక్ ట న్నుల ధాన్యం ఉత్పత్తితో ప్రధమ స్థానంలో నిలవగా, ఉత్తర ప్రదేశ్ 1.55కోట్ల మెట్రిక్‌టన్నుల ఉత్పత్తితో ద్వితీయ స్థానంలో నిలిచింది.

పంజా బ్ 1.27కోట్ల టన్నులతో తృతీయ స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడే నాటికి విసిరేసినట్టుగా చిరవన పదవ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్టం ఏకంగా ఆరేళ్లలోనే అధ్భుత ప్రగతిని కనబరిచింది. 2020-21నాటికి ఏకంగా నాలుగో స్థానంలో నిలిచింది.రాష్ట్ర విభజన అనంతరం 78.82లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలోకి దిగిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయ రంగానికి 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరాతో పంటల సాగు పట్ల రైతుల్లోధీమా పెరిగింది. కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాల వినియోగం పెరిగింది. అటు కృష్ణానదీజలాలను కూడా సమర్ధవంతంగా వినియోగించేకోగులుగుతున్నారు.

భూగర్భజల మట్టాలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితులన్నింటితోపాటు ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం అమలు ద్వారా రైతుల్లో ఉత్సాహం పెరిగింది. పంటల సాగు విస్తీర్ణత పెరిగింది. ప్రత్యేకించి వరిసాగు కోటి 20లక్షల ఎకరాలకు చేరుతోంది. ధాన్యం ఉత్పత్తి కూడా భారీగాపెరిగిపోయింది. ఒక దశలో ఇక తెలంగాణ ధాన్యం మొత్తం కొనుగోలు చేయటం తమవల్ల కాదని కేంద్ర ప్రభుత్వమే చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. దేశమంతటా కలిపి 12.43కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగితే అందులో తెలంగాణ రాష్ట్ర ధాన్యమే కోటి2లక్షల టన్నులు ఉందంటే తెలంగాణ రైతుల సత్తా ఏమిటో స్పష్టమవుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News