Monday, December 23, 2024

స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరకి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మల్దకల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక వ్యక్తి దారుణ హత్యకకు గురైన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని నాగర్ దొడ్డి గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. స్థానిక ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెదిన వెంకట్రాములు అనే వ్యక్తి శనివారం రాత్రి చర్చికి వెళ్లడంతో అదే గ్రామానికి చెందిన బెల్లం రాజు(35) అనే వ్యక్తి వెంకటరాములు ఇంట్లోకి వచ్చాడు. వెంకట్రాములు భార్య, రాజు ఇరువురు బాత్‌రూమ్‌లో ఉండగా ఊహించని విదంగా బాత్రూమ్ వైపు వెళ్లిన వెంకట్రాములు శబ్దాలు విని వెంటనే బయటకు వెళ్లి తన సోదరుడు వెంకటేష్‌కు చెప్పాడు.

ఇద్దరు కలిసి రాజును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చెట్టుకు కట్టేసి గొడ్డలితో నరికారు. తీవ్రంగా గాయపడిన రాజును ఆస్పత్రికి తరలించేలోపు మరణించాడు. గత కొన్ని సంవత్సరాలుగా మిత్రుడు వెంకట్రాములు భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇరువురిని పలుమార్లు హెచ్చరించడం, రాజుతో గొడవలు జరిగిన్నట్లు సమాచారం. శనివారం రాత్రి ఇరువురు సన్నిహితంగా ఉండటం చూసిన వెంకట్రాములు అతని సోదరుడు వెంకటేష్ తో కలిసి రాజును హత మార్చాడని ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

man murdered as Illegal affair in Makthal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News