Monday, December 23, 2024

దాడుల దడ

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇడి, ఐటి, సిబిఐ వంటి సంస్థలు ఎప్పుడు, ఎవరి మీద పడతాయోననే భయాందోళనల్లో బడా పారిశ్రామికవేత్తల దగ్గర్నుంచి చిన్నచిన్న ఫంక్షన్‌హాళ్లు యాజమానులు కూడా హడలిపోతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు, గ్రానైట్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, ఐటి కంపెనీలు, కార్పోరేట్ ఆసుపత్రులు, రియల్ ఎస్టే ట్ కంపెనీలు, మద్యం వ్యాపారులు ఇలా ఒక్కటేమిటీ చివరకు ఫం క్షన్‌హాళ్లను కూడా వదలట్లేదు! రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వెంటనే ఈ దాడులను కట్టడి చేయాలని వీరంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ, పరిశ్రమలు, ఆర్థ్ధికశాఖల ఉన్నతాధికారుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

దర్యాప్తు పేరుతో సిబిఐ నిర్వహించిన దాడుల్లో సాధించేదేమీ లేకపోయినప్పటికీ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, కొందరు రాజకీయ నాయకుల పేర్లను లీక్ చేస్తూ ఆ సంస్థ కావాలనే టెన్షన్ పెట్టిందే తప్ప ఎలాంటి నే ర నిరూపణ చేయలేకపోయింది. అయితే ఈ దా డులతో తాము మానసికంగా ఎంతో వేదన అనుభవించినట్లు పలువురు పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారాలు చేయడం, డ బ్బును సంపాదించడం కూడా నేరమేనన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వేధింపులకు గు రిచేయడం బాధకరమన్నారు. తాము చేసే వ్యాపారాలకు, సంపాదించే డబ్బుకు సమగ్రంగా పన్ను లు చెల్లిస్తూనే ఉన్నా ఈ దర్యాప్తు సంస్థలు తమను నేరస్తులుగా చూడడం సరికాదంటున్నారు. ఇటు ప్రభుత్వం, అటు తెలంగాణ రాష్ట్రంపైనా కేవలం కక్ష సాధించడం కోసమే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా నడుచుకొంటూ దర్యాప్తు సంస్థలు అడ్డగోలుగా దాడులు చేస్తున్నాయని విమర్శిస్తున్నా రు.

సెక్షన్ 41 ప్రకారం నోటీసులు కూడా ఇవ్వకుండా దాడులు చేసి వేధించడం సబబుకాదని, రాష్ట్ర హైకోర్టు కూడా చీవాట్లు పెట్టినా కేంద్ర దర్యాప్తు సంస్థలు పద్ధ్దతి మార్చుకోవడం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అడ్డగోలుగా ఎలాంటి విచక్షణ లేకుండా, తగిన స మాచారం లేకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దాడులు చేసి తమ వ్యాపారాలతో పాటు కుటుంబ సభ్యులను హడలెత్తించి సొసైటీలో తమ ప్రతిష్టలను మంటగలిపే విధంగా ఈ దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయని, ఇన్‌కం ట్యాక్స్ (ఐటి) రిటర్న్‌లు నెలనెలా ఇవ్వడానికి ప్రతి కంపెనీలోనూ ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకొని కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకుంటున్నామని, అంతేకాకుండా బ్యాంకులతో లావాదేవీలు నెరపడానికి కూడా ప్రత్యేకంగా అకౌంట్స్ విభాగాలు, తగిన ఉద్యోగులను నియమించుకొని నిబంధనల ప్రకారమే చేస్తున్నా దాడులు ఆగడం లేదంటున్నారు.

పరిచయాలు నేరమా?

చిన్న తరహా వ్యాపారాల నుంచి పెద్దపెద్ద వ్యాపారాలు, కంపెనీలు, పరిశ్రమలను నడుపుతున్నప్పుడు తప్పకుండా ప్రభుత్వంలోని అధికారులు, రాజకీయ నాయకులు పరిచయాలు ఉంటాయి. అలా పరిచయాలు ఉండడమే నేరమన్నట్లుగా భావించి కేవలం సెల్‌ఫోన్లలో కాల్‌లిస్ట్ చూసుకొని కూడా దాడులు చేస్తున్నారు. ఇదెక్కడి చోద్యమో అర్ధం లేదంటూ తలలు పట్టుకుంటున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని రాష్ట్రంలో ఎలాంటి దర్యాప్తులు చేయడానికి వీల్లేదని నిషేధించడం మంచిదైందని, అదే విధంగా ఉద్దేశపూర్వకంగా దాడులు చేసే మిగతా సంస్థలను కూడా నిషేధించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ దాడులు చేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులతోనే చేయాలని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను చూపించాలని, ఇలా ఏకపక్షంగా దాడులు చేయడాన్ని కట్టడి చేయాలని కోరుతున్నారు. ఐటి శాఖ నిబంధనలన్నీ చాలా కఠినంగా మారాయని, వ్యక్తులకే కాకుండా కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలు, చివరకు ఫంక్షన్‌హాళ్లకు పాన్‌కార్డులు వేర్వేరుగా ఉన్నాయని, బ్యాంక్‌లలో అకౌంట్‌లు కూడా వేర్వేరుగా ఉంటాయని చెబుతున్నారు.

ఇన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశాలు లేవని, ఒకవేళ ఈ మొత్తం వ్యవస్థను దాటుకొని పాల్పడడం అంత తేలిక కాదని, ఎక్కడో ఒకచోట దొరికిపోతారని అంటున్నారు. అందుచేత దాడులు చేయాల్సి వస్తే ముందస్తుగా ప్రాథమిక ఆధారాలు చూపించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగే విధంగా కట్టడి చేయాలని కోరుతున్నారు. ఈడి, ఐటి విభాగాలు నేరుగా దాడులు చేయకుండా తగిన సాక్షాధారాలను సేకరించిన తర్వాతనే దాడులు నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాల్లో కొన్ని సవరణలు చేసుకోవచ్చునని కొందరు సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, ఐటి శాఖలు, ఆర్థ్ధిక శాఖాధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

ఐటి, ఇడి సంస్థలు కేంద్ర ప్రభుత్వ పెద్దల చేతిలో కీలుబొమ్మలుగా మారడం, కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసమే దాడులు చేస్తుండడం, దాడుల గురించి రాష్ట్ర బిజెపి నాయకులు ముందుగానే ప్రకటించడం వంటి అంశాలన్నీ పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ దాడులన్నీ రాజకీయ ఆ దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయనే అంశాలను మరింత తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఇదివరకే రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లుగానే సుప్రీంకోర్టుకూ తెలియజేయాలని, ఇతర బాధిత రాష్ట్రాల్లోనూ ఈ సంస్థల దాడుల వెనుక ఉన్న మర్మాన్ని బహిర్గతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పూనుకోవాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. ఇలా పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల నుంచి వస్తున్న డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News