Friday, December 20, 2024

యువతిని చంపేసి… కారు డిక్కీలో దాచిపెట్టి….

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: యువతిని సహోద్యోగి చంపేసి మృతదేహాన్ని కారు డిక్కీలో దాచిపెట్టిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దయాల్‌బంద్ ప్రాంతంలో ప్రియాంక సింగ్ అనే యువతి జాబ్ చేస్తుంది. నాలుగు రోజుల నుంచి ఆమె ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె ఫోన్‌కు ఎవరి నుంచి చివరి కాల్ వచ్చిందో గుర్తించి వెంటనే ఆశిశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక గొంతు నులిమి తానే హత్య చేశానని సహోద్యోగి ఆశిశ్ తెలిపాడు. కారు డిక్కీలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని శవ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రియాంక సింగ్ స్వస్థలం భిలాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News