Friday, December 20, 2024

కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్/గచ్చిబౌలి : సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన నగరంలోని కొండాపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అక్షయ్ కుమార్ అనే యువకుడు పదిహేను రోజుల క్రితమే నగరంలోని ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని హైదరాబాద్‌కు వచ్చాడు. కొండాపూర్‌లో బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచే విధులకు హాజరయ్యేవాడు. అక్షయ్‌కుమార్ తండ్రి దేవేందర్ రెవెన్యూ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

అంతకు ముందు ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద పిఎగా పనిచేశాడు. అలాగే సొంత జిల్లాలో అక్షయ్ కుమార్‌పై పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అదే విధంగా అక్షయ్‌కుమార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని కొందరి వద్ద డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీ సులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన అక్షయ్‌కుమార్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాను కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. గచ్చిబౌలి సిఐ సురేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News