Sunday, November 24, 2024

ఈ రాష్ట్రాల్లో చార్జీలను పెంచిన ఎయిర్‌టెల్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : హర్యానా, ఒడిషా రాష్ట్రాల్లో కనీస రిచార్జి ప్లాన్ల ధరలను భారతీ ఎయిర్‌టెల్ పెంచింది. ప్రస్తుతం ఉన్న 28 రోజుల రూ.99 రీచార్జ్ ప్లాన్‌ను కంపెనీ 57 శాతం పెంచింది. ఇప్పుడు 28 రోజుల టారిఫ్ ప్లాన్ కోసం రూ.99కి బదులుగా రూ.155 చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం కంపెనీ ఈ రీచార్జ్ ప్లాన్‌ను హర్యానా, ఒడిశాలో విడుదల చేయగా, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ ప్లాన్‌ను విస్తరించే అవకాశముందని తెలుస్తోంది. రూ.99 ప్లాన్ స్థానంలో ఇప్పుడు ఎయిర్‌టెల్ రూ.155 లకు అపరిమిత కాలింగ్‌తో 1 జిబి డేటాతో 300 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఇకపై రూ. 155 లోపు అన్ని ప్లాన్‌లను కంపెనీ నిలిపివేయనుంది. ఈ టారిఫ్ పెంపు 4జి కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News