Sunday, December 22, 2024

మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

 

సంగారెడ్డిః జగ్గారెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేసే నైతిక హక్కు సంగారెడ్డి బిజెపి నాయకులకు లేదని టిపిసిసి కార్యదర్శి తోపాజి అనంతకిషన్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు నిరూపించిన రాహుల్ గాంధీని మహారాష్ట్రలో బిజెపి నేతలు చీపురు కట్టలు, చెప్పులతో నిరసనలు తెలపడాన్ని జగ్గారెడ్డి ఖంఢించారని చెప్పారు. దీనిని సంగారెడ్డి బిజెపి నాయకులు రాద్దాంతం చేసి జగ్గారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంతోష్, జార్జ్, బుచ్చిరాములు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News