Friday, December 20, 2024

ఐబీసీ కాంటినమ్‌, వెబ్‌ 3.0 ఆల్ట్‌ హ్యాక్‌ను ప్రారంభించిన ఇంటర్నేషనల్‌ బ్లాక్‌చైన్‌ కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఐబీసీ మీడియా ఈరోజు ఐబీసీ కాంటినమ్‌ వెబ్‌ 3.0 హ్యాక్‌ఫెస్ట్‌ ఛాలెంజ్‌ను భారతదేశ వ్యాప్తంగా ప్రొఫెషల్స్‌,  విద్యార్థుల కోసం హైదరాబాద్‌లోని టీ–హబ్‌ వద్ద ప్రారంభించినట్లు వెల్లడించింది. తెలంగాణా రాష్ట్ర ఐటీఈ అండ్‌ ఎస్‌ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌ ఈ కార్యక్రమాన్ని టాస్క్‌ సీఈఓ శ్రీ శ్రీకాంత్‌ సిన్హా; టీ–హబ్‌ సీఈఓ శ్రీ శ్రీనివాసరావు మహంకాళి మరియు ఐబీసీ మీడియా ఫౌండర్‌–సీఈఓ శ్రీ అభిషేక్‌ పిట్టీ సమక్షంలో ప్రారంభించారు.

ఉమ్మడి నిర్వహణ బృందంలో, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఏజెన్సీలు, పరిశ్రమ పార్టిస్పెంట్స్‌, ఐబీసీమీడియా ఉన్నారు. ఇదే సందర్భంలో ఐబీసీ యొక్క ఎజెండాకు హెడ్‌లైన్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న పోల్కాడాట్‌ మద్దతుతో ఇంటర్నేషనల్‌ బ్లాక్‌ చైన్‌ కాంగ్రెస్‌ ఐబీసీ 2.0 రెండవ ఎడిషన్‌ కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంవత్సరపు సదస్సును ఐబీసీ 2022–23కాంటినమ్‌ నేపథ్యంతో నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటి మరియు ఆసియాలో అతిపెద్ద బ్లాక్‌చైన్‌ సదస్సును నిర్వహించిన గౌరవాన్ని హైదరాబాద్‌ అందుకుంది. ఈ సదస్సును 2018లో ఇంటర్నేషనల్‌ బ్లాక్‌చైన్‌ కాంగ్రెస్‌ (ఐబీసీ) నిర్వహించింది. రెండవ ఎడిషన్‌ 2022–23 కాంటినమ్‌ను అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన స్పీకర్లుతో సమాచార యుక్త మరియు అనుసంధానిత సదస్సులు,నెట్‌వర్కింగ్‌ అవకాశాలతో పరిశ్రమ నాయకులు, ప్రభుత్వ మేథావులను కలుసుకునే అవకాశం, భారతదేశ వ్యాప్తంగా డెవలపర్‌ మరియు విద్యార్ధి కమ్యూనిటీల కోసం 2018లో తెరువబడిన నూతన మార్గాలను నిర్మించుకునే అవకాశాలు నిర్మించుకోవడం కొనసాగించవచ్చు.

ఐబీసీ 2022–23లో మార్గదర్శక కార్యక్రమాలలో ఒకటిగా ఐబీసీ ఎడ్యుకేషన్‌ మరియు సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐబీసీ టెక్‌ వయోజ్‌) నిలుస్తుంది. దీనిని ప్రత్యేకంగా వెబ్‌ 2.0 సామర్ధ్యంల నుంచి ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ కమ్యూనిటీ వెబ్‌ 3.0 ఇండస్ట్రీ రెడీ డెవలపర్స్‌గా మారడానికి ఇది తోడ్పడుతుంది. ఈ కార్యక్రమం సమగ్రమైన, ఫుల్‌ సైకిల్‌ ఎజెండాతో ఉంది. దీనిలో ఓరియెంటేషన్‌, అగ్రగామి బ్లాక్‌చైన్‌, వెబ్‌ 3.0 నిపుణులతో విద్య , అనుసరించి శిక్షణ, మేధోమధన సదస్సులు, అగ్రగామి మెంటార్ల మార్గనిర్దేశకత్వంలో స్పీడ్‌ బల్డింగ్‌ చేయడం, విజేతల వెల్లడి కార్యక్రమాలు ఉంటాయి.

ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం , ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వర్క్‌షాప్‌లు , బూట్‌క్యాంప్‌లు, హ్యాకథాన్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లు, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లను అందించడం ద్వారా అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. లైవ్‌ ప్రాజెక్ట్‌లతో ఈ కార్యక్రమం ముగించడం వల్ల విద్యార్థులు పరిశ్రమ అవసరాలను తీర్చే రీతిలో సిద్ధంకావడంతో పాటుగా భారతదేశంలో ప్రధానమైన కెరీర్‌ అవకాశాల కోసం డెవ్‌– ఇంజినీరింగ్‌ కమ్యూనిటీలలో చేరడానికి వీలు కల్పిస్తుంది. ఇంజినీరింగ్‌ కాలేజీల దృశ్యమాన్యతను పెంచుకునే అవకాశం ఇది అందించడంతో పాటుగా పరిశ్రమకు సిద్ధమైన వెబ్‌ 3.0 కోసం నాణ్యమైన ప్రతిభావంతులను సృష్టించడం ద్వారా తమ బ్రాండ్లను నిర్మించుకునే అవకాశమూ అందిస్తుంది. ఇది అంతర్జాతీయంగా బ్లాక్‌చైన్‌ మరియు వెబ్‌ 3 కంపెనీలు తమ సంస్ధలలో నియామకాలు చేసుకునేందుకు ఆసక్తికలిగిస్తుంది.

ఈ దిశగా, ఐబీసీ ఇప్పుడు ఆల్ట్‌ హ్యాక్‌ను నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలో మూడు నగరాలలో జరిగే హ్యాక్‌ ఫెస్ట్‌.దీనిలో గణణీయంగా ఒక కోటి రూపాయల వరకూ బహుమతి మొత్తం అందిస్తారు.

ఈ సిరీస్‌లో మొదటగా –ఐబీసీ హ్యాక్‌ ఫెస్ట్‌ హైదరాబాద్‌ను నవంబర్‌ 22న టెక్‌ మహీంద్రా వద్ద ప్రారంభించారు. దీనిని అనుసరించి ఎనిమిది రోజుల హ్యాక్‌థాన్‌ జరుగుతుంది. దీనిలో భాగంగా శిక్షణ, మేధోమధనం , మెంటార్‌ ఆధారిత స్పీడ్‌ బిల్డింగ్‌ సెషన్స్‌ జరిగి డెమోడేతో ముగుస్తాయి. ఐబీసీ హ్యాకథాన్‌ ఇప్పుడు పార్టిస్పెంట్స్‌కు అంతర్జాతీయ వెబ్‌ 3.0 కంపెనీలు తీర్చిదిద్దిన అనుకూలీకరించిన కోర్సులను అందిస్తుంది. ఇది ప్రత్యక్ష రిక్రూట్‌మెంట్‌కు దోహదపడుతుంది.

హ్యాకథాన్‌ రౌండ్స్‌ మరియు తేదీలు

హైదరాబాద్‌ వద్ద జరిగే రౌండ్స్‌ – నవంబర్‌ 22 నుంచి నవంబర్‌ 29 ,2022
విశాఖపట్నం వద్ద జరిగే రౌండ్స్‌– డిసెంబర్‌ 10 నుంచి 18, 2022
బెంగళూరు వద్ద జరిగే రౌండ్స్‌– జనవరి 2023 మొదటి వారం

ఐబీసీ ఇప్పుడు పలు కాలేజీలతో భాగస్వామ్యం చేసుకుంది. తాజా బ్లాక్‌చైన్‌ మరియు వెబ్‌ 3టెక్నాలజీస్‌లో విద్యార్ధులకు అదనపు నైపుణ్యాలను అందించడం ద్వారా వారు ప్రయోజనం పొందడంతో పాటుగా అంతర్జాతీయ సర్టిఫికేషన్‌, గుర్తింపు (పేరెంట్‌ –ప్రిన్సిపల్‌ అవార్డు)ను వెబ్‌ 3.0 శిక్షణ లో భాగంగా అందిస్తుంది. కాలేజీ స్ధాయి రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌కు కూడా ఇది సహాయపడుతుంది. దీనిలో భాగంగా విజయవంతమైన విద్యార్ధులను అగ్రగామి బ్లాక్‌చైన్‌, వెబ్‌ 3.0 కంపెనీలు ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా తెలంగాణా ఐటీఈ అండ్‌ ఎస్‌ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ ‘‘ ఐబీసీ 2022–23 కాంటినమ్‌ ప్రధానంగా ఐబీసీ 2018పై ఆధారపడి నిర్మించడం లక్ష్యంగా చేసుకుంది. దీనితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా రెగ్యులేటర్లు, పాలసీ మేకర్లు, పరిశ్రమ ప్రభావశీలురు, వ్యాపారవేత్తలు, కార్పోరేట్‌ ప్రతినిధులు, డెవలపర్లును ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటుగా చర్చ జరిగేందుకూ తోడ్పడుతుంది. ఇది విద్యార్థులు, పార్టిస్పెంట్స్‌కు బ్లాక్‌చైన్‌ పరిశ్రమలో మూవర్స్‌ అండ్‌ షేకర్స్‌తో ప్రత్యక్షంగా చర్చించే అవకాశాలు కల్పిస్తుంది. తద్వారా వారు కేవలం బ్లాక్‌చైన్‌ భవిష్యత్‌ను మాత్రమే తెలుసుకోవడంతో పాటుగా భావితరపు ఇంటర్నెట్‌ , డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధ మరియు వెబ్‌3.0ను అర్ధం చేసుకునే అవకాశమూ అందిస్తుంది’’ అనిఅన్నారు

తెలంగాణా టాస్క్‌ సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా మాట్లాడుతూ ‘‘తెలంగాణాలోని విద్యార్ధులు తమను తాము మెరుగుపరచుకునేందుకు, భవిష్యత్‌లో భాగమయ్యేందుకు అత్యద్భుతమైన అవకాశంగా నిలుస్తుంది. వెబ్‌3.0 కోసం మన వ్యాపారాలను మెరుగుపరిస్తే అది అవకాశాలనూ అందిస్తుంది. కానీ మనకు సరైన నైపుణ్యాలు, వనరులు లేకపోతే అది సవాల్‌గానూ పరిణమిస్తుంది. వెబ్‌ 3.0లో ఇప్పుడు ఐబీసీ ఎడ్యుకేషన్‌ అందించే శిక్షణతో విద్యార్ధులు మెరుగైన నైపుణ్యాలు సంతరించుకోవడంతో పాటుగా కార్పోరేషన్స్‌కు తమ వ్యాపారాలను ఆధునీకరించుకునేందుకు సుశిక్షితులై ప్రోగ్రామర్లను పొందగలవు’’ అని అన్నారు

‘‘వెబ్‌ 3.0 కు నిర్మాణాత్మక విద్యా ప్రక్రియ అవసరం పడుతుంది. యూజర్లు ఏం చెబుతున్నారు లేదా ఈ ప్లాట్‌ఫామ్స్‌పై ఏం చేస్తున్నారనే దానిపై పూర్తి నియంత్రణకు ఇది అనుమతిస్తుంది. ఐబీసీ మీడియా యొక్క విద్యా కార్యక్రమాలు వెబ్‌3.0తో స్టూడెంట్‌ కమ్యూనిటీని శక్తివంతం చేయడం ద్వారా ఈ కీలకమైన సేవను అందించడానికి స్పష్టమైన మార్గాన్ని అందిస్తుంది. ఐబీసీ మీడియాతో కలిసి పనిచేయడం పట్ల మేము ఆనందంగా ఉన్నాము. మాప్రయత్నాలు భవిష్యత్‌ నాయకులను తీర్చిదిద్దడంతో పాటుగా వెబ్‌3.0 అమలుకు వారు నేతృత్వం వహించనున్నారు’’ అని అర్బన్‌ ఓస్వాల్డ్‌, గ్రోత్‌మేనేజర్‌, వెబ్‌ 3 ఫౌండేషన్‌ అన్నారు

‘‘నూతన సాంకేతికతలైనటువంటి రికమెండేషన్‌, ఆటోమేషన్‌ మరియు ఏఐ ఇప్పుడు కన్స్యూమర్‌ ప్యాక్డ్‌ గూడ్స్‌ (సీపీజీ) పరిశ్రమను సమూలంగా మార్చడంతో పాటుగా బ్లాక్‌ చైన్‌ రాబోయే కాలంలో అత్యంత కీలకంగా వ్యాపారాలకు అవసరమైన పారదర్శకత, నమ్మకం వంటి రెండు అత్యంత కీలకమైన వినియోగదారుల అవసరాలతో నిలువనుంది. నిత్యం మమ్మల్ని మేము ఆధునీకరించడాన్ని మేము నమ్ముతుంటాము మరియు విద్యలో నూతన కార్యక్రమాలకు మద్దతు అందిస్తుంటాము. మా విద్యార్ధులకు అదనపు నైపుణ్యాలను అందించడంలో ఐబీసీ అద్భుతంగా తోడ్పడుతుంది. సీపీజీ పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల స్వీకరణ పరంగా ఉన్న అంతరాలను పూరించడానికి దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నాము’’ అని రవీందర్‌ కుమార్‌ అగర్వాల్‌, డైరెక్టర్‌, డ్యూక్స్‌ ఇండియా అన్నారు.

ఈ కార్యక్రమం గురించి ఐబీసీ మీడియా ఫౌండర్‌ అండ్‌ సీఈఓ అభిషేక్‌ పిట్టి మాట్లాడుతూ ‘‘ఔత్సాహిక విద్యార్ధులు, టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌ మరియు ప్రొఫెషనల్స్‌ కోసం ఈ హ్యాకథాన్స్‌ అవకాశంగా నిలువడంతో పాటుగా వెబ్‌ 3.0 టెక్నాలజీ ఏ విధంగా ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను తీరుస్తాయో వెల్లడిస్తుంది. ఐబీసీ 2022–23 మరోమారు తిరిగి రావడం పట్ల సంతోషంగా ఉన్నాము. భారతదేశ వ్యాప్తంగా కాలేజీలు, యూనివర్శిటీల నుంచి ప్రతిభావంతులైన విద్యార్ధులు ఈ హ్యాకథాన్స్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే వాస్తవ ప్రపంచపు సవాళ్లను సాంకేతికత ఏ విధంగా పరిష్కరిస్తుందో అభ్యసించాల్సిందిగా కోరుతున్నాము’’అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News