మన తెలంగాణ/ మన్ననూర్: అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం, ఆర్ ఐటిఐ కళాశాల మన్ననూర్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదిన ఉద్యోగమేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా జూనియర్ ఉపాధి కల్పనాధికారి బి. రాఘవేందర్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటార్స్, శ్రీ విజయ బయో ఫర్టిలైజర్స్ అనే రెండు ప్రైవేట్ కంపెనీలలో నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌లో పనిచేసేందుకు 200 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
ఆసక్తి గల వారు పది, ఇంటర్, డిప్లమా, ఐటిఐ, డిగ్రీ ఆపై చదివిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు తమ స్టడీ సర్టిఫికేట్స్, బయోడెటా ఫామ్‌తో ఈ నెల 25వ తేదిన మన్ననూర్ గ్రామంలోని ఆర్ ఐటిఐ కళాశాలలో నిర్వహించే ఇంటర్వూలకు హాజరు కావాలని సూచించారు. ఎన్నికైన అభ్యర్థులకు వివిధ పోస్టుల వారిగా నెలకు 8వేల నుంచి 12 వేల వరకు జీతం ఇవ్వబడుతుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయం సిబ్బంది 97012 00819 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.