Saturday, December 21, 2024

విజయవాడ రైల్వేయార్డులో యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: విజయవాడ రైల్వేయార్డులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బ్లేడ్ బ్యాచ్ ముఠా హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నైజాంగేట్ సిగ్నల్ అండ్ టెలికాం ఆఫీస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఇదే ప్రాంతంలో గంజాయి ముఠా సభ్యుడి హత్య జరిగింది. 6 నెలల వ్యవధిలోనే నైజాంగేట్ లో మూడు హత్యలు జరిగాయి. వరస హత్యలతో నైజాం గేట్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News