Friday, December 20, 2024

షాద్‌నగర్‌లో 110 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల గంజాయిని ఎస్‌ఒటి పోలీసులు పట్టుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగింది. రమేష్ అనే వ్యక్తి కారులో భద్రాచలం నుంచి నేరుగా వెళ్తే పట్టుకుంటారనే అనుమానంతో వయా గుంటూరు, కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా రాయ్‌కల్ టోల్‌గేట్ వద్ద వాహనాన్ని షాద్‌నగర్ ఎస్‌ఓటి పోలీసులు ఆపారు. కారులో తనిఖీలు చేయగా 110 గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఒక్కో ప్యాకెట్ కిలో ఉంది. రమేష్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా టీమ్‌లో వీరన్న, సోమరాజులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News