మన తెలంగాణ/ ధర్మారం: మేడారం ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం సందర్శించారు. గురువారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మేడారం ఆసుపత్రి భూమి పూజకు రానున్న సందర్భంగా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, నాయకులు సుమారు ఐదు నుండి పది వేల మంది హాజరయ్యేలా చొరవ చూపాలని, ఈ ప్రాంతంలో తొలిసారిగా ఇంత పెద్ద ఆసుపత్రి అన్ని హంగులతో అందుబాటులోకి వస్తుందున ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ ప్రాంత అవసరాల దృష్టా సీఎం కేసీఆర్ చొరవతో అభివృద్ధిలోకి వస్తుందని, దీనికి మన సహకారం కూడా తోడవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఫోరం జిల్లా చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, మార్కెట్ చైర్మన్ కొమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్, జిల్లా పరిషత్ కోఆప్షన్ ఎండి సలామోద్దిన్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మిట్ట తిరుపతి, సర్పంచ్ సామంతుల జానకి శంకర్, ఎంపీటీసీ కట్ట సరోజ స్వామి, ఉపసర్పంచ్ కట్ట రమేష్, టీఆర్‌ఎస్ గ్రామాధ్యక్షుడు రాచూరి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Koppula Eshwar visits Medaram Hospital