Friday, January 10, 2025

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో సంచలనం..

- Advertisement -
- Advertisement -

దొహా: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో బుధవారం మరో పెను సంచలనం నమోదైంది. గ్రూప్‌ఇలో భాగంగా పటిష్టమైన జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో ఆసియా ఆశాకిరణం జపాన్ 2-1 గోల్స్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఇప్పటికే సౌదీ అరేబియా బలమైన అర్జెంటీనాను చిత్తుగా ఓడించి వరల్డ్‌కప్‌లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా జపాన్ కూడా ఇలాంటి ఫలితాన్నే నమోదు చేసింది. ప్రపంచకప్ ఫేవరెట్‌లలో ఒకటిగా భావిస్తున్న జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ చారిత్రక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇరు జట్లు ఎటాకింగ్ గేమ్‌ను కనబరచడంతో మ్యాచ్‌లో హోరాహోరీ తప్పలేదు. పటిష్టమైన జర్మనీ డిఫెన్స్‌ను ఛేదించుకుంటూ జపాన్ ఆటగాళ్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించారు.

అయితే ప్రథమార్ధంలో జపాన్ ఆటగాళ్లు ఎంత పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు ఆట 33వ నిమిషంలో జర్మనీఆటగాడు లికె గుండోగన్ కళ్లు చెదిరే గోల్‌ను సాధించాడు. దీంతో తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి జర్మనీ 10 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలావుంటే ద్వితీయార్ధంలో కూడా పోరు ఆసక్తికరంగా సాగింది. ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు జర్మనీ తీవ్రంగా ప్రయత్నించింది. మరోవైపు జపాన్ స్కోరును సమం చేయాలనే లక్షంతో సర్వం ఒడ్డింది. ఎట్టకేలకు 75వ నిమిషంలో జపాన్ ప్రయత్నం ఫలించింది. రిస్టు డువాన్ చిరస్మరణీయ ప్రదర్శనతో అద్భుత గోల్‌ను నమోదు చేశాడు.

దీంతో స్కోరు 11తో సమమైంది. 83వ నిమిషంలో స్టార్ ఆటగాడు టకుమా అసానొ జపాన్‌కు మరో గోల్ అందించాడు. కాగా, స్కోరును సమం చేసేందుకు జర్మనీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన జపాన్ 20 తేడాతో చారిత్రక విజయాన్ని సాధించింది.

FIFA 2022: Japan beat Germany by 2-1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News