Saturday, December 21, 2024

ఎస్ఐకి రూ.3 లక్షలు ఇచ్చాను?…. నా చావుకు అతడే కారణం..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల న్యూస్: తన చావుకు ఎస్‌ఐ కారణమని ఓ యువకుడు లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… బల్వంతాపూర్ గ్రామంలో నక్క అనిల్ అనే యువకుడు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భూమిని కొందరు కబ్జా చేయడంతో కేసు పోలీస్ స్టేషన్‌కి చేరింది. తన భూమి తనకి ఇప్పిస్తానని ఎస్‌ఐ చెప్పడంతో అతడికి అనిల్ మూడు లక్షల రూపాయలు లంచం ఇచ్చానని ఆరోపణలు చేశాడు. సదరు ఎస్‌ఐ కబ్జాదారులతో చేయి కలిపి తనని పలు కేసులలో ఇరికించాడని అనిల్ వాపోతున్నాడు.

డిజిపి, సిపికి లేఖ రాసి అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేసి తన పొలం దగ్గర అనిల్ పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రైతులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ లంచం తీసుకొని తనని మోసం చేయడంతో పాటు పలు కేసులు నమోదు చేయడంతో తాను ఆత్మహత్య చేసుకున్నానని లేఖ రాశాడు. మల్యాల ఎస్‌ఐ చిరంజీవిని మీడియా సంప్రదించగా … అనిల్‌పై ఎనిమిది కేసులు ఉన్నాయని, అతడిపై రౌడీషీట్ తెరిచామని, కేసుల తొలగింపునకు తమపై ఒత్తిడి తీసుకవస్తున్నారని, అందుకే పురుగుల మందు తాగి ఉంటాడని ఎస్‌ఐ తెలిపాడు. తాను మూడు లక్షల రూపాయలు తీసుకున్నట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News