Monday, December 23, 2024

డిజిటల్ మీడియా నియంత్రణకు కేంద్రం సరికొత్త చట్టం?!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు వీలుగా ఓ బిల్లును తేడానికి కేంద్రం పనిచేస్తోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు. గతంలో వార్తలు వన్‌వే కమ్యూనికేషన్‌గా ఉండేదని, కానీ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వచ్చాక వార్తలు తెలిపే విధానం మల్టీడైమెన్షనల్ గా మారిందని ఆయన వివరించారు. నేడు చిన్న గ్రామాల్లోకి కూడా డిజిటల్ మీడియా ద్వారా జాతీయ వార్తలు చేరుకుంటున్నాయన్నారు. ప్రభుత్వం చాలా వరకు స్వీయ నియంత్రణను ప్రింట్, ఎలెక్ట్రానిక్, డిజిటల్ మీడియాకిచ్చిందని తన ప్రకటనలో పేర్కొన్నారు.

“చట్టంలో మార్పులు తేవలసి ఉంది. మీ పని సులభంగా, సింపుల్‌గా ఉండేలా మేము ఓ బిల్లును తేబోతున్నాం” అని ఆయన ‘మహానగర్ టైమ్స్’ అనే ఓ హిందీ వార్తాపత్రిక ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చెప్పారు. 1867 ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ స్థానంలో త్వరలో కొత్త చట్టాన్ని తేబుతున్నామని ఆయన తెలిపారు. కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక వారంలోనే ఆన్‌లైన్ పద్ధతిలో జరిగిపోతుందని, అది ఇదివరలో నాలుగు నెలల సమయం తీసుకునేదని తెలిపారు. “సరైన వార్త, సరైన సమయంలో ప్రజల ముందుకు వార్తా పత్రికలు తేవాలి” అని అనురాగ్ ఠాకుర్ తెలిపారు. ప్రభుత్వ విధానాలు, ప్రజా సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ లొసుగులు వంటివన్నీ సామాన్యులకు అందాల్సి ఉందని ఆయన చెప్పారు. “మీడియా భయాలు, అయోమయం వాతావరణం సృష్టించడం మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News