Monday, January 20, 2025

ఆగమేఘాల మీద ఎందుకు సిఈసిని నియమించారు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ అదికారి అరుణ్ గోయెల్‌ను ఆగమేఘాల మీద ప్రధాన ఎన్నికల అధికారిగా ఎందుకు నియమించాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాగా ప్రభుత్వం తరఫు న్యాయవాది ‘నోరు జారొద్దు’ అని కోర్టును కోరారు. అంతేకాక ‘మొత్తాన్ని’ చూడాలన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి నియమాకం విషయాన్ని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. అరుణ్ గోయెల్ నియామకం ఫైల్‌ను గురువారం పరిశీలించింది. “న్యాయశాఖ నలుగురి పేర్ల జాబితా నుంచి అతడిని ఎంచుకుంది. కాగా ఫైల్ నవంబర్ 18న దాఖలు కాగా, అదే రోజున ఆమోదించేశారు. ప్రధాని కూడా అదే రోజున ఆయన పేరును సిఫార్సు చేసేశారు. మేమేమి తగాదాను కోరుకోవడంలేదు. కాకపోతే ఎందుకింత వేగిరంగా చేశారు? అనేదే తెలుసుకోవాలనుకుంటున్నాం” అని ధర్మాసనం అభిప్రాయపడింది.

అప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకరమణి “నోరు అదుపులో పెట్టుకోంది. మొత్తాన్ని చూడండి” అన్నారు. దానికి కోర్టు “ ఒకవేళ నలుగురి పేర్లను జాగ్రత్తగా ఎంపికచేసినట్లయితే…ఎంపిక విధానం గురించి మేము పరిశీలించాల్సి ఉంది” అంటూనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ఆఫీసర్ డేటాబేస్ నుంచి ఆ నలుగురి పేర్లను ఎలా షార్ట్‌లిస్ట్ చేశారని ప్రశ్నించింది. ధర్మాసనానికి న్యాయమూర్తి కెఎం. జోసెఫ్ నేతృత్వం వహించారు. అరుణ్ గోయెల్ ఇటీవలే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. అలాంటప్పుడు ఆదరాబాదరగా ఆయనను ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నియమించారా? అన్న సందేహాన్ని కూడా ధర్మాసనం వ్యక్త పరిచింది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం అరుణ్ గోయెల్ నవంబర్ 21న బాధ్యత తీసుకున్నారు. ఆయన పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన 37 ఏళ్ల సర్వీస్ తర్వాత కేంద్ర భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. రాజీవ్ కుమార్ తర్వాత ఆయన ప్రధాన ఎన్నికల అధికారి అయ్యారు.

అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి అభ్యంతరాలను కోర్టు త్రోసి పుచ్చింది. “సీనియర్ బ్యూరోక్రట్ల జాబితాను మొదట రూపొందించారు. దానిని న్యాయ మంత్రిత్వ శాఖకు పంపారు. ఆ తర్వాత దానిని ప్రధానికి పంపారు” అని న్యాయవాది వాదించారు. పైగా “వ్యవస్థ అంతా సజావుగా నడుస్తోంది. కోర్టు జోక్యం చేసుకోవలసిన అవసరం కూడా లేదు” అన్నారు. దానికి కోర్టు “ సిస్టం బాగాలేదని మేమనడంలేదు. కాకపోతే పారదర్శకత ఉండాలి” అంటున్నాం అని వ్యాఖ్యానించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News