Saturday, November 23, 2024

తెలంగాణ హైకోర్టు ఆదేశాలు కొట్టేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టిన కేసులో తెలంగాణ హైకోర్టు ఇటీవల ప్రత్యేక పరిశోధన బృందం(సిట్)కు ఇచ్చిన వివిధ ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. రాజకీయ అధికారులు లేక కార్యనిర్వాహక అధికారులు ఎవరికీ ఎలాంటి రిపోర్టు చేయకూడదని కూడా పేర్కొంది. న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్‌తో కూడిన ధర్మాసనం నవంబర్ 21న ఇలా పేర్కొంది “ డివిజన్ బెంచ్ 2022 నవంబర్ 15న జారీ చేసిన తీర్పు, ఉత్తర్వులను కొట్టివేయడమైనది, పక్కన పెట్టేయడమైనది. ప్రస్తుత పిటిషనర్ పెట్టుకున్న పిటిషన్లను మెరిట్ ఆధారంగా, చట్ట ప్రకారం, వీలయినంత త్వరగా అంటే నేటి నుంచి నాలుగు వారాల్లోగా సింగిల్ జడ్జీ పరిశీలించాలి”.

తెలంగాణ హైకోర్టు నవంబర్ 15న వివిధ ఆదేశాలను జారీచేసింది. పరిశోధనకు సంబంధించిన పురోగతి తొలి రిపోర్టును సీల్డ్ కవర్‌లో సిట్ హైకోర్టు ఏకసభ్య న్యాయమూర్తికి అందజేయాలన్నది కూడా ఒకటి. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వును సవాలుచేస్తూ రామచంద్ర భారతి సహా ముగ్గురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది.
“ డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జారీచేసిన ఆదేశాలు కొన్ని చట్టంరీత్యా ఆమోదయోగ్యంగా లేవని మేము భావిస్తున్నాం” అని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయడానికి డివిజన్ బెంచ్ నిరాకరిస్తూ, ‘సిట్’ ఏ రాజకీయ, కార్యనిర్వాహక అధికారికి రిపోర్ట్ చేయరాదన్నది. ఇదిలావుండగా పరిశోధనలో ఏ అధికారి జోక్యంచేసుకోరాదని హైకోర్టు ఆదేశించింది. పరిశోధన ప్రగతిని సీల్డ్ కవర్‌లో ఎప్పటికప్పుడు సమర్పించొచ్చని పేర్కొంది. ఇంతేకాక బెయిల్ దరఖాస్తును హైకోర్టు పరిశీలించాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం కోరింది. పిటిషనర్లు 22 రోజులుగా కటకటాల వెనుక ఉన్నందున… త్వరగా పూర్తి చేయాలని కూడా ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News