అక్లాండ్: ఈడెన్ పార్క్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. కివీస్ ముందు 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. వాషింగ్టన్ సుందర్ చివరలో ధాటిగా ఆడడంతో 300 పైగా స్కోర్ దాటింది. సుందర్ 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. తొలి వికెటపై ఓపెనర్లు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శుభారంబాన్ని ఇచ్చారు. నాలుగో వికెట్ పై సంజూ శామ్సన్, శ్రేయస్ అయ్యర్ 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో గౌరవ ప్రదమైన స్కోరుకు భారత జట్టు చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్(04) స్వల్ప స్కోర్ కే ఔట్ కావడంతో భారత్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ బ్యాట్స్ మెన్లు శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధావన్(72), శుభమన్ గిల్(50), వాషింగ్టన్ సుందర్(37 నాటౌట్), సంజూ శామ్సన్(36), రిషబ్ పంత్ (15), సూర్యాకుమార్ యాదవ్(04), శార్థూల్ టాకూర్(01) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో పరుగుజన్, టీమ్ సౌతీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా అడమ్ మిల్నే ఒక వికెట్ తీశారు.