Monday, December 23, 2024

ఐదుగురు మిలీషియా సభ్యుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/వెంకటాపురం(నూగూరు): మండల పరిధిలోని బాదాపురం గ్రామ శివారులోని తిప్పాపురం వెళ్లే రహదారి వద్ద ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శివప్రసాద్ వివరాలు వెల్లడించారు. బోదాపురం గ్రామ శివారులోని తిప్పాపురం క్రాస్ రోడ్డు వద్ద గురువారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని, పోలీసులను చూసి పారి పోతుండగా గమనించిన పోలీసులు సోడి నరసింహారావు, సోడి లక్ష్మయ్య, సోడి కాంతమ్మ, బోడిగ గజేందర్, మడే సూరిబాబు అనే ఐదుగురరు పెంకవాగు గ్రామానికి చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న వ్యక్తులను విచారించగా 2018 సంవత్సరంలో నిషేధిత మావోయిస్టు పార్టీ విప్లవ భావాలకు ఆకర్షితులై పార్టీ సానుభూతి పరులుగా చేరి సహాయ సహకారాలు అందించారని తెలిపారు.

అనంతరం మిలీషియా సభ్యులుగా పదోన్నతులు పొంది పార్టీ కోసం పనిచేస్తూ వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ ఆదేశాల మేరకు ఛత్తీస్‌గడ్ రాష్ట్ర ఉటపల్లిలో అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నాయకులు కలిసి వారి ఆదేశాలను ఉట్లపల్లిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నాయకులు కలిసి వారి ఆదేశాల మేరకు డిసెంబర్ మొదటి వారంలో జరిగే పిఎల్‌ఏ వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను అలుబాక గ్రామ శివారుల్లో రోడ్డుపైకి వస్తున్న క్రమంలో పట్టుబడ్డారని తెలిపారు. 2019 నుండి పలురకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తులకు కోర్టులో హాజరు పరచనున్నట్లు సిఐ తెలిపారు. ఈ సమావేశంలో వెంకటాపురం ఎస్‌ఐ తిరుపతి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News