Saturday, December 21, 2024

బిల్లు అడిగితే మూత్రం తాగించారు

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్‌లో దళితుడ్ని కొందరు వ్యక్తులు తీవ్రంగా కొట్టి, మూత్రం తాగించారు, చెప్పుల దండ వేసి తిప్పారు. ఈ సంఘటనను దాడికి పాల్పడ్డ వారిలో ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి తరువాత సామాజిక మాధ్యమంలో పెట్టాడు. తాను చేసిన పనికి డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు సిరోహిలో ఈ వ్యక్తిపై ఈ నెల 19న దాడి జరిగింది. 38 ఏండ్ల భరత్‌కుమార్ ఓ చోట కరెంటుకు సంబంధించిన కొన్ని పనులు చేశాడు.

దీనికి సంబంధించి తనకు రూ 21,100 రావాలని బిల్లు చూపి పైసలు కావాలని ప్రాధేయపడ్డాడు. దీనికి వారు రూ 5వేలు ఇచ్చి వెళ్లు అని కసురుకున్నారు. తరువాత రెండు మూడుసార్లు వారిని మిగిలిన సొమ్ముకోసం ఈ దళితుడు అడిగాడు. దీనితో చాలా సేపటివరకూ బయట నిలబడమని చెప్పి, ఆ తరువాత బయటకు వచ్చి ఈ వ్యక్తిని బాగా కొట్టి దౌర్జన్యానికి దిగారని , బెదిరింపుల కారణంగా ఈ వ్యక్తి ఆలస్యంగా ఫిర్యాదు చేశాడని సిరోహి డిఎస్‌పి దినేష్ కుమార్ శుక్రవారం తెలిపారు. భరత్‌కుమార్‌ను ఈ వ్యక్తులు దాదాపు ఐదుగంటల పాటు చిత్రహింసలు పెట్టారని పోలీసు అధికారి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News