Tuesday, January 21, 2025

యూజి, పిజి ఫెయిల్ అయిన విద్యార్థులకు వన్ టైం చాన్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటి పరిధిలోని కాలేజీల్లో గతంలో డిగ్రీ, పిజి చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటి శుభవార్త చెప్పింది. డిగ్రీ, పిజిల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్ళీ పరీక్షలు రాసి డిగ్రీ పట్టా పొందే అవకాశాన్ని యూనివర్సిటీ కల్పించింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు వన్ టైం చాన్స్ కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల నిర్వాహకుల వినతి మేరకు అకాడమిక్ స్టాండింగ్ కమిటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2010 నుంచి 2017 విద్కాయ సంవత్సరం వరకు వివిధ కోర్సులు చదివి ఫెయిల్ అయిన వారికి ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆయా విద్యార్థులు పేపర్‌కు రూ. 10 వేల చొప్పున అపరాధ రుసుము చెల్లించాలిస ఉంటుందని వెల్లడించారు. ఎంఈ, ఎంటెక్, ప్రాజెక్టు, వైవాకు రూ. 20 వేలు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలకు https://www.osmania.ac.in వెబ్ సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News