- Advertisement -
జైపూర్: పని చేసి కూలీ డబ్బులు అడిగినందుకు దళితుడి మెడలో చెప్పుల దండ వేసి, కులం పేరుతో దూషించిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భరత్ కుమార్ జులావా అనే దళితుడు ఓ డాబాలో పని చేశాడు. అనంతరం కూలీ డబ్బులు ఇవ్వాలని పవన్ సింగ్ చౌహాన్, ములారమ్ భట్, సురేంద్ర సింగ్ సోడాను అడిగాడు. వెంటనే ముగ్గురి కలిసి భరత్‌ను కులం పేరుతో దూషించారు. అనంతరం అతడి మెడలో చెప్పుల దండ వేసి కించపరిచారు. భరత్ వీడియో రికార్డు చేసి కోట్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారి రాజేంద్ర సింగ్ రాజ్‌పురోహిత్ ముగ్గురిపై ఎస్‌సి ఎస్‌టి ఎట్రాసిటి కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -