Monday, December 23, 2024

గోల్డ్ మెడల్ సాధించిన ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు కూతురు

- Advertisement -
- Advertisement -

 

ఖమ్మం: ఇటీవల ఖమ్మం జిల్లాలో గొత్తికోయల చేతిలో ఓ ఫారెస్ట్ అధికారి హత్యకు గురికావడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనతో ఆయన సహోద్యోగులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారు ఏడ్వడం చూసిన జనం గుండెలు బాదుకున్నారు. ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు మరణించిన నాలుగో రోజు, అతని కుమార్తె క్రీడా పోటీలలో పాల్గొని విజయం సాధించింది. అదనంగా, ఆమె రాష్ట్ర స్థాయిలో పోటీలకు అర్హత సాధించింది.

ఆమె తన తండ్రికి ఆదర్శవంతమైన కుమార్తె అని నిరూపించింది. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్తగూడెంలో శుక్రవారం ఉమ్మడి ఖమ్మం సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్‌కు హాజరైంది. అండర్-10 విభాగంలో లాంగ్ జంప్‌లో స్వర్ణం, 100 మీటర్ల పరుగులో రజతం సాధించింది. డిసెంబరు 5,6 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైంది. తండ్రి చనిపోయిన ఆయన చూపిన బాటలోనే విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది. అయితే కృతికలో క్రీడా స్ఫూర్తిని నింపింది మాత్రం ఆ చిన్నారి పెద్దనాన్న క్రిష్ణయ్య. క్రిష్ణయ్య ప్రభుత్వ పాఠశాలలో పిటిగా పనిచేస్తూ కృతికకు శిక్షణ ఇస్తున్నట్లు చిన్నారి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News