Sunday, January 19, 2025

కేంద్రం దగా.. అన్నదాతలను వంచిస్తున్న మోడీ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతులక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం దగా చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన సందర్భంగా దేశ రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఆ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ సంయుక్త కి సాన్ మోర్చా, ఆదివాసి అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో శనివారం ఛలో రాజభవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన సభలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు టీ. సాగర్, పశ్య పద్మ, వేములపల్లి వెంకట్రామయ్య, వస్కుల మట్టయ్య, గుమ్మడి నరసయ్య, రణధీర్ ,ప్రసాదన్న,గోపాల్, బాలమల్లేష్, గిరిజన సంఘాల నాయకులుఆర్. శ్రీరాం నాయక్, ఆర్ అంజయ్య నాయక్,తుకారాం నాయక్ తదితరులు మాట్లాడుతూ గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనీ ఆరోపించారు.

అందులో భాగంగానే చలో ఢిల్లీ కార్యక్రమం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని, విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతుల హామీలను నెరవేర్చడం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన 29 మందిలో కార్పొరేట్ అనుకూలంగా ఉన్నవాళ్లే ఉన్నందున ఆ కమిటీని బహిష్కరిస్తున్నామని ఆనాడే కేంద్రానికి తెలిపినట్టు చెప్పారు. లక్కింపూర్ ఖేరి ఘటనలో రైతులను చంపిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఆసీస్ కుమార్ మిశ్రాపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసినా పరోక్షంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలున్నాయని అన్నారు.విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని,రైతులు,వ్యవసాయ కార్మికులకు నెలకు 5,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు అడవులు ,అటవీ సంపదను అంబానీ,ఆధాని లాంటి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు అటవీ సంరక్షణ నియమాలు 2022 పేరుతో మరో దుర్మార్గమైన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేయబోతున్నది చెప్పారు. దీనివలన అడవులపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాదిమంది గిరిజనులు అడవుల నుండి బలవంతంగా గంటి వేయబడతారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులు అటవీ హక్కు కోసం డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News