Monday, December 23, 2024

హీరోయిన్ల ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సినిమా హీరోయిన్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఎపిలోని కోనసీమ జిల్లా, రాయవరం మండలం, పాసర్లపూడి గ్రామానికి చెందిన పందిరి రామవెంకట వీరాజు ప్రైవేట్ ఉ ద్యోగం చేస్తున్నాడు.

ఓ మహిళ ఫొటోను నిందితు డు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలో మార్ఫింగ్ చేసి పెట్టడంతోపాటు అసభ్యంగా కామెంట్లు పెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు సోషల్ మీడియాలో సినీ యాక్టర్లను ఫాలో అవుతున్నట్లు తెలిసింది. వారి ఫొటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి ట్విట్టర్, ఫే స్‌బుక్, వాట్సాప్, టెలీగ్రాం, ఇన్‌స్టాగ్రాంలో పెట్టి అసభ్యంగా కింద రాస్తున్నాడు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News