హైదరాబాదు: సరైన రీతిలో కార్పోరేట్ ఆలోచనాధోరణిని అభివృద్ధి చేసేందుకు, మెరుగైన పని సంస్కృతి, ప్రొఫెషనల్ విలువలను జొప్పించేందుకు కెఎల్‌హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ హైదరాబాద్‌లోని తమ క్యాంపస్‌లో ‘కాఫీ విత్ హెచ్‌ఆర్’ కార్యక్రమం నిర్వహించింది. కెఎల్‌హెచ్‌జీబీఎస్ వద్ద మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హెచ్‌ఆర్ నిపుణురాలు, హైదరాబాద్‌లోని ఆర్సెసియం బిజినెస్ పార్టనరింగ్ మరియు టాలెంట్‌మేనేజ్‌మెంట్ హెడ్ సుజితా రావూరి పాల్గొన్నారు. వరుసగా పలు ఇంటరాక్టివ్ సదస్సులను విద్యార్థుల కోసం నిర్వహించడంతో పాటుగా పలువురు ప్రముఖులు, వ్యాపార నిపుణులను కలిసే అవకాశం అందించారు. తద్వారా ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రక్రియలు, ఉద్యోగ మార్కెట్ మరియు కార్పోరేట్ ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడం పట్ల అవగాహన కల్పించారు.
కాఫీ విత్ హెచ్‌ఆర్ కార్యక్రమానికి మేనేజ్‌మెంట్ విద్యార్ధుల నుంచి అపూర్వ స్పందన లభించింది. విద్యార్ధులు అత్యంత చురుకుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడంతో పాటుగా తమ ఆలోచనలను పంచుకున్నారు. అంతేకాదు స్ఫూర్తినందించే రీతిలో వాస్తవ జీవిత కథలు, విజయగాథలు, సాధించిన విజయాలను తెలుసుకుని ఉత్సాహం పొందారు.
డాక్టర్ జీ.పి. సారధి వర్మ, వైస్ ఛాన్స్‌లర్, కెఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ మాట్లాడుతూ ఈ తరహా సదస్సులు కార్పోరేట్ ప్రపంచంలో అత్యున్నత ప్రక్రియల పట్ల లోతైన అవగాహనను విద్యార్ధులు పొందేందుకు, మారుతున్న కార్పోరేట్ అవసరాలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడం గురించి విద్యార్థులు నేర్చుకునేందుకు తోడ్పడతాయి. ఇది యూనివర్శిటీకి మరో గర్వకారణమైన కార్యక్రమంగా నిలుస్తుంది. భవిష్యత్‌లో సైతం సుప్రసిద్ధ హెచ్‌ఆర్ ప్రొఫెషనల్స్ చేత మెరుగైన సదస్సులను నిర్వహించనున్నామన్నారు
ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమ నిపుణులతో మెరుగైన బంధాన్ని సృష్టించడం లక్ష్యంగా చేసుకున్నారు. దీనితో పాటుగా లీడర్‌షిప్ ఎంగేజ్‌మెంట్ పట్ల అవగాహన అందించడం, ఉద్యోగ అనుసంధానిత కార్యక్రమాలు, హెచ్‌ఆర్ విధానాలు, ఒకరి వ్యక్తిత్వం గుర్తించడం, తదనుగుణంగా సరైన ఉద్యోగాన్ని కనుగొనడం పట్ల కూడా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అన్ని అంశాలలోనూ సర్వోన్నతంగా ఉండాల్సిన ఆవశ్యకత ను నొక్కి చెప్పారు. ఎన్నో రంగాలలో అద్భుతాలను సృష్టించడానికి ఇది పునాదిగా నిలుస్తుందని కెఎల్‌హెచ్ జీబీఎస్ డైరెక్టర్ డాక్టర్ ఏ రామకృష్ణ అన్నారు.
ఈ సందర్భంగా శ్రీమతి సుజితా రావూరి మాట్లాడుతూ ..‘‘బిజినెస్ స్కూల్ వద్ద తమ విద్యార్ధులకు అత్యుత్తమ మరియు అత్యున్నతమైన పరిశ్రమ అవగాహన కల్పించేందుకు మేనేజ్‌మెంట్ మరియు మెంటార్లు చేసిన గొప్ప ప్రయత్నమిది. ఈ కార్యక్రమం విద్యార్ధులకు నూతన అవకాశాలను తెరుస్తుంది. విద్యార్ధుల నడుమ నూతన ఆలోచనలు తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం’’అని అన్నారు. రావూరి అత్యంత అనుభవం కలిగిన హెచ్‌ఆర్ నిపుణురాలు. దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఆమెకు మానవ వనరుల నిర్వహణపై ఉంది. ఈ మానవ వనరులపై ఆధారపడి అత్యున్నత పనితీరు కలిగిన వర్క్ కల్చర్‌ను సృష్టించడంతో పాటుగా ఉద్యోగుల లక్ష్యి త సంస్ధలను నిర్మించారు.
ఈ సదస్సులో పాల్గొన్న నిపుణులు విస్తృత స్థాయిలో పలు అంశాలను గురించి చర్చించారు. కంపెనీలలో ఉద్యోగుల శ్రేయస్సుకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారు, సరైన ఉద్యోగం కోసం సరైన వ్యక్తులను ఎంచుకోవడం తదితర అంశాలను గురించి ప్రస్తావించారు. హెచ్‌ఆర్‌లో తాజా ఽధోరణులు, నేటి ఉద్యోగ ప్రపంచంలో ఉద్యోగుల ఆనందం అతి ముఖ్యమైన అంశంగా ఎలా పరిగణించబడుతుంది, వారి హ్యపీనెస్ ఇండెక్స్‌ను కంపెనీలు ఏ విధంగా మ్యాపింగ్ చేస్తున్నాయి, కంపెనీలు ఏ విధంగా వినూత్నంగా ఆలోచించడం ప్రారంభించాయి, ఇన్నోవేషన్ సంస్కృతి ఏ విధంగా భారీ కార్పోరేషన్స్‌లో ప్రధానంగా దృష్టిసారించిన అంశంగామారింది వంటి అంశాలను చర్చించారు. కన్వీనర్ డాక్టర్ స్వరూప తో పాటుగా ఇతర ఫ్యాకల్టీ సభ్యులు, యూనివర్శిటీ అధికారులు మరియు విద్యార్ధులు ఈ కార్యక్రమం భారీ విజయం సాధించడంలో తోడ్పడ్డారు.