Monday, December 23, 2024

కళాశాల మిత్రులతో గెట్ టు గెదర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్..

- Advertisement -
- Advertisement -

అనాధలకు క్రీడా పాఠశాల, వృద్ధాశ్రమం ఏర్పాటు
పాలమూరు ప్రాజెక్టుతో జిల్లా సస్యశ్యామలం చేస్తాం
కళాశాల మిత్రులతో గెట్ టు గెదర్‌లో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ/మహబూబ్ నగర్: స్వంత ఊరిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఏ మాత్రం కష్టపడకుండా గెలిచే అవకాశం ఉన్న అసెంబ్లీ స్థానాలను సైతం వదిలేసి మహబూబ్ నగర్ వచ్చి ఎన్నికల్లో పోటీ చేశానని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తను చదువుకున్న మహబూబ్ నగర్ ఎంవిఎస్ డిగ్రీ కళాశాల 1985 88 బ్యాచ్ డిగ్రీ క్లాస్ మేట్ మిత్రులతో కేసీఆర్ అర్బన ఎకో పార్కులో ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్‌కు హాజరై తన గత స్మృతును గుర్తు చేసుకున్నారు.

నిత్యం విధి నిర్వహణలో బీజిగా ఉండే మంత్రి కాసేపు తన పనులన్నింటిని పక్కన పెట్టి తన కళాశాల మిత్రులతో సమావేశమై పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ జీవితం, టీజిఓ స్థాపన, ఉద్యమ సమయం, తెలంగాణ పోరాటం, సీఎం కేసీఆర్‌తో కలిసి చేసిన పోరాటంలో ముందుకు సాగడం, రాష్ట్ర సాధన, ఎమ్మెల్యేగా ఎన్నికవడం, ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టడం… చూస్తుండగానే జరిగిపోయాయని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలని గతంలో ఎన్నడూ అనుకోలేదని, కానీ ఇపుపడు ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. తమ కుటుంబంలో కనీసం సర్పంచ్ స్థాయి పదవిలో ఉన్నవారు కూడా ఎవరూ లేకపోయినా, రాజకీయంగా ఎవరి వెన్నుదన్ను లేకపోయినా ఈ స్థాయికి రావడం మహబూబ్ నగర్ ప్రజల సహాకారం వల్లే సాధ్యమైందన్నారు. మహబూబ్ నగర్‌ను ఊహించని స్థాయిలో అభివృద్ది చేయడమే తన కర్తవ్యమని అన్నారు.

సీఎం కేసార్ సహాకారంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి సాగునీటిని అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేయడం తన లక్షమని మంత్రి వివరించారు. అనాధలకు క్రీడా పాఠశాల ఏర్పాటు చేసి వారిని అత్యున్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ముదిమి వయస్సులో ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలుస్తామని తెలిపారు. మహబూబ్ నగర్‌ను హైదరాబాద్‌కు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. మంత్రి క్లాస్‌మేట్స్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ నాగరత్నమ్మ, వనపర్తి జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాస్, నారాయణపేట ఆర్‌డిఓ రాంచందర్, పిఆర్‌టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నారాయణ గౌడ్, రఘురామ్ గౌడ్, రఘురామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News