ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియ ర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోని యా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో.. తె లుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తులసీరామ్ సాప్పని, షణ్ముగం సా ప్పని.. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నా రు. డిసెంబర్ 16 గ్రాండ్‌గా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో చిత్రయూనిట్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఓ గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తెలుగు ట్రైలర్‌ను ఎపి మినిస్టర్ ఆర్.కె. రోజా, కన్నడ ట్రైలర్‌ను తుంగతుర్తి ఎంఎల్‌ఎ డా. గాధరి కిశోర్ కుమార్, మలయాళం ట్రైలర్‌ను దర్శకుడు -నటుడు చిన్నికృష్ణ, తమిళ ట్రైలర్‌ను ‘నాంది’ సతీష్ విడుదల చేయగా.. టైటిల్ సాంగ్‌ను వైజాగ్ ఎంఎల్‌సి వం శీకృష్ణ యాదవ్ విడుదల చేశారు.
ఈ సందర్భం గా మినిస్టర్ రోజా మాట్లాడుతూ.. “సినిమాలలో పొలిటికల్ సీన్స్ వచ్చినప్పుడు శాసనసభని చూపిస్తారు. కానీ ఈ సినిమాకే ‘శాసనసభ’ అని టైటిల్ పెట్టడం చాలా ఆసక్తికరంగా అనిపించింది. శాసనసభలో ప్రస్తుతం సినిమా తరహా సీన్లే కనిపిస్తున్నాయి. హీరో ఇంద్రసేనని చూసి.. సడెన్‌గా కెజియఫ్ హీరో వచ్చాడేమో అనుకున్నాను. చాలా చక్కగా ఇందులో ఆయన నటించారు. చిత్ర దర్శకుడు వేణు మడికంటి మాట్లాడుతూ.. ‘ఇంద్రసేన ఇందులో యాక్షన్ హీరోగా కనిపిస్తారు. ఆయనకి ఈ సినిమా చాలా మంచి పేరుని తీసుకువస్తుంది. చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమాని నిర్మాతలు పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లారు.
ఈ సినిమా విడుదల తర్వాత ‘శాసనసభ’లో జరిగేదాని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. రాజేంద్రప్రసాద్ పాత్ర సినిమాకి హైలెట్‌గా ఉం టుంది” అని అన్నారు. నిర్మాతలలో ఒకరైన తుల సీ రామ్ మాట్లాడుతూ..“ మంచి సబ్జెక్ట్, మంచి కమిట్మెంట్‌తో ఒక సినిమా తీశాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో ఇంద్రసేన, హీ రోయిన్ ఐశ్వర్యరాజ్, ఎంఎల్‌ఎ గాధరి కిషోర్, ‘నాంది’ సతీష్, నటుడు చిన్ని కృష్ణ, వైజాగ్ ఎంఎల్‌సి వంశీకృష్ణ యాదవ్, సురేష్ వర్మ, దర్శకుడు, నటుడు అనిష్ కురివిల్లా, రాఘవేంద్ర రెడ్డి, సం గీత దర్శకుడు రవి బస్రూర్, నిర్మాత షణ్ముఖం త దితరులు పాల్గొన్నారు.