Friday, November 22, 2024

జీరో కోవిడ్ పాలసీపై జనం ధిక్కారం

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనాలో తన అధికారపు ఉడుంపట్టును బిగించిన అధినేత జి జిన్‌పింగ్‌కు తొలిసారి లాక్‌డౌన్ల చిక్కు సమస్య తీవ్ర సవాలుగా మారుతోంది. చైనాలోని పలు నగరాలలో ఆదివారం జనం పెద్ద ఎత్తున కోవిడ్ లాక్‌డౌన్లకు నిరసనగా వీధులలోకి వచ్చారు. జిన్‌పింగ్ ప్రభుత్వం దేశంలో జీరో కోవిడ్ పాలసీని ఖచ్చితంగా అమలులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వైరస్ ఉధృతి తిరిగి తలెత్తడంతో పలు నగరాలలో తీవ్రస్థాయిలో లాక్‌డౌన్లు ఇతర ఆంక్షలు విధించారు.

దీనితో ఇప్పటికే కోటి మందికి పైగా తమ నిత్య దైనందిన జనజీవితాలకు సంకట పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొంటూ నిరసనలకు దిగారు. ప్రభుత్వంపై పార్టీపై సైన్యంపై తన పట్టును బిగించుకుని ఉన్న దేశాధ్యక్షులు జిన్‌పింగ్ ఇప్పుడు జనం నుంచి లాక్‌డౌన్లు తమకు వద్దని, వీటితో జనజీవితం స్తంభిస్తుందని, కూలీరోజువారి వేతనాలకు ముప్పు వాటిల్లుతుందని రోడ్డెక్కకపోతే బతుకుల నడవవని నిరసిస్తూ ప్రదర్శనలకు దిగుతున్నారు.

ఇది నిజంగానే అధికారిక లాక్‌డౌన్లను ధిక్కరిస్తున్న స్థాయికి చేరుతోంది. చైనా కటుతర వైరస్ కట్టడి వ్యూహం ఇప్పుడు ప్రజల నిస్పృహలతో తలపడుతోంది. ఉన్నట్లుండి ఆంక్షలు, దీర్ఘకాలిక క్వారంటైన్లు, సామూహిక వైద్య పరీక్షల కార్యక్రమాలను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గురువారం వాయవ్య చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతపు రాజధాని ఉరుంకిలో తలెత్తిన ఘటన ఇప్పటి జనాగ్రహాన్ని మరింత రగిల్చింది. అక్కడ ప్రతిష్టాత్మక ఐఫోన్ కంపెనీ కార్మికులు పెద్ద ఎత్తున లాక్‌డౌన్లను ధిక్కరించి విధులక రావడం పోలీసులతో తలపడటం వారిని అణచివేసేందుకు బలప్రయోగం వంటి ఘటనలు జరిగాయి.

ఆదివారం బీజింగ్‌లోని సింగ్యూవా యూనివర్శిటీ క్యాంపస్‌లో వందలాది మంది ర్యాలీ చేపట్టారు. లాక్‌డౌన్లను నిరసించారు. విద్యార్థులు క్యాంటిన్ వద్ద గుమికూడారని , పలువురు ఇతర ప్రాంతాలలోనూ చేరారని వెల్లడైంది. వీరు జాతీయ గీతం ఆలాపించారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోని నినాదాలకు దిగారు. స్వేచ్ఛ విలసిల్లాలి, లాక్‌డౌన్ల నిర్బంధాలొద్దు, మాకు ఫ్రీడం కావాలని పేర్కొన్నారు. జనం జీవితాలపై లాక్‌డౌన్లు సెన్సార్‌షిప్‌ల వంటివని పేర్కొంటూ పలు చోట్ల తెల్లకాగితాలతో నిరసనలు దిగారు. షాంఘైలో ఆదివారం పెద్ద ఎత్తున జనం చేరారు. మైన ప్రదర్శనకు దిగారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News