Monday, December 23, 2024

స్టూవర్ట్‌పురం కానిస్టేబుల్ దొంగాల ముఠాలకు రారాజు….

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ఓ ఘరానా కానిస్టేబుల్ దొంగల ముఠాలను తయారు చేసి వారితో దొంగతనాలు చేయించేవాడు. పోలీసులకు దొరికినచో వారిని జైలు నుంచి బెయిల్‌పై బయటకు తీసుకరావడంతో పాటు వారితో మళ్లీ దొంగతనాలు చేయించిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లాలో చరవాణీలు ఎక్కువగా చోరి గురకావడంతో పోలీసులు అటువైపు దృష్టి పెట్టారు. దొంగలను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మా సార్ చేయిస్తున్నాడని సమాధానం చెప్పారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా కానిస్టేబుల్ ఈశ్వర్ దొంగలీలలు బయటపడ్డాయి. ఈశ్వర్ అనే కానిస్టేబుల్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా స్టూవర్ట్‌పురం నివాసి. పలు స్టేషనలలో ఈశ్వర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించాడు. అతడు నేర విభాగంలో పని చేయడంతో దొంగలతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి.

సొత్తు రికవరీ చేసేటప్పుడు ఎస్‌ఐ, సిఐలకు భాగాలు పంచడంతో పాటు తాను కొంత తీసుకునేవాడు. దొంగలతో పరిచయలు ఉండడంతో ఉద్యోగానికి సెలవు పెట్టి అంతరాష్ట్ర దొంగలతో కలిసి ముఠాలు ఏర్పాటు చేశాడు. ఏడు ముఠాలు తయారు చేసి బహిరంగ సభలు, జనసమూహం ప్రాంతాలు, రైతు బజార్లు, షాపింగ్ మాల్స్‌లో దొంగతనాలు చేయించేవాడు. దీంతో పాటు వారికి నెల నెల రూ.40000 నుంచి 50000 వరకు జీతం ఇచ్చేవాడు. ఈశ్వర్ వేధింపులు తట్టుకోలేక కొందరు దొంగలు రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. ఇద్దరు మహిళలపై సదరు కానిస్టేబుల్ అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు పలు స్టేషన్లలో కేసులు నమోదు చేసి ఈశ్వర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈశ్వర్‌ను అరెస్టు చేయడంతో నలుగురు సిఐలపై అంతర్గతంగా విచారణ సాగుతోంది. ఈశ్వర్ అరెస్టు చేయడంతో పోలీస్ విభాగంలో సిఐలు, ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల వెన్నుల్లో వణుకుపుడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News