Friday, December 20, 2024

త్వరలో 1,020 కొత్త బస్సుల కొనుగోళ్లు

- Advertisement -
- Advertisement -

మూడునెలల్లో ప్రయాణికులకు అందుబాటులోకి….
టిఎస్ ఆర్టీసి యాజమాన్యం ప్రకటన
మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు అద్దె ప్రాతిపదికన నడపాలని ఆర్టీసి యోచన

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు టిఎస్ ఆర్టీసి చర్యలు చేపట్టింది. త్వరలో 1,020 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఆర్టీసి యాజమాన్యం స్పష్టం చేసింది. నూతన బస్సులతో ప్రయాణికులకు మరింత చేరువ కావాలని టిఎస్ ఆర్టీసి యోచిస్తోంది. మరో రెండు,మూడు నెలల్లో ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. కొత్తగా కొనుగోలు చేయనున్న బస్సుల్లో సూపర్ లగ్జరీ, ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

టిఎస్ ఆర్టీసి ఈ బస్సులను సొంతంగా కొనుగోలు చేయనుంది. గ్రేటర్‌లో ఇప్పటికే పాత సిటీ బస్సులు 720 ఉండగా వాటిని తుక్కు కింద మార్చనున్నట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాల్లో పాతబడిపోయిన సూపర్ లగ్జరీ బస్సులను గ్రేటర్‌లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. పాత బస్సులను మియాపూర్ బస్ బాడీ బిల్డింగ్ స్టేషన్‌కు తరలించి అక్కడ వాటిలో మార్పులు చేసి సిటీ బస్సులుగా తయారు చేయనున్నారు. సూపర్ లగ్జరీ బస్సులకో తోడుగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన ఆర్టీసి నడపాలని నిర్ణయించింది. మొత్తానికి వెయ్యికి పైగా వచ్చే కొత్త ఇస్సులతో టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని ప్రయత్నిస్తోంది.

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ విద్యార్థుల బస్‌పాస్‌లకు అనుమతి

దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ విద్యార్థుల బస్‌పాస్‌లను గ్రేటర్ హైదరాబాద్ పరిమితి వరకు అనుమతించాలని ఆర్టీసి అధికారులు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శివార్లలోని కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సిటీ బస్సుల్లోనే వారి పాసులు చెల్లుబాటు అవుతున్నాయి. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో విద్యార్థుల సాధారణ బస్సు పాసులను అనుమతించడం లేదు. నగర శివారులో సిటీ బస్సులు తక్కువగా తిరుగుతున్నందున వీరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఆర్టీసి సిటీ బస్‌పాస్ ఉన్న విద్యార్థులను పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులోనూ ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఇటీవల ఆర్టీసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News