Saturday, December 21, 2024

విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/తంగళ్లపల్లి: విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి చెందిన సంఘటన మండలంలోని అంకుసాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే సారంపెల్లి గ్రామానికి చెందిన కూనవేని పర్శరాములు(35) పొలం పనుల నిమిత్తం అంకుసాపూర్ గ్రామానికి వెళ్లాడు. బోరు మోటారు వేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.

గమనించిన సమీప రైతులు చేరుకొని ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందినట్లు తెలిపారు.మృతునికి భార్య నవ్య,కూతుళ్లు కావ్య(12),అక్షయ(10)లు ఉన్నారు. విషయం తెలుసుకున్న సెస్ అధికారులు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు.పర్శరాములు మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News