- Advertisement -
హైదరాబాద్: 2009 నవంబర్ 29 తెలంగాణ పవిత్రమైన దినమని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి, ఢిల్లీ పునాదులను కదిలించిన దీక్షా దివస్ స్పూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమవుదామని గంగుల పిలుపునిచ్చారు. చరిత్ర తిప్పిన నవంబర్ 29 చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ప్రశంసించారు. తెలంగాణ వచ్చుడో… కెసిఆర్ సచ్చుడో అంటూ కెసిఆర్ అమరణ నిరాహార దీక్ష చేప్టటిన రోజు అని గంగుల అన్నారు. కెసిఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కెసిఆర్ చేపడతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో సాగునీటి సమస్య తీరిపోయిందన్నారు. రైతు సంక్షేమ పథకాలతో భూమికి బరువయ్యే పంటలు తెలంగాణలో పండుతున్నాయని గంగుల ప్రశంసించారు.
- Advertisement -