Tuesday, November 26, 2024

పోలీస్ జాబ్‌కు ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: పోలీస్ జాబ్‌కు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ పిజి కళాశాలలో టీఎస్ ఎస్సీ స్టడి సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సిద్దిపేట ఎస్సీ స్టడి సర్కిల్ ద్వారా 194 మంది ఎస్సీ మహిళా అభ్యర్ధులకి పోలీస్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్‌ను సీపీ శ్వేతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫిజికల్ పరీక్షలు దగ్గరలో ఉన్నందున అందరు ఒక క్రమ పద్దతిలో ప్రణాళికలు రూపొందించుకొని చదవాల్సి ఉంటుందన్నారు.

గ్రౌండ్‌కు సంబంధిత సమస్యలు తీర్చడానికి రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్‌రెడ్డిని అందుబాటులో ఉండాలని అదేశించారు. మంచి ట్రైనింగ్ ఉన్న పిఈటిలను పెట్టాలన్నారు. టెన్షన్ అనేది దగ్గరకు రాకుండా ఎలాంటి సమస్య వచ్చిన శిక్షణకు మాత్రం రావాలన్నారు. మంచి క్రమ శిక్షణతో చదవాలి. ఒక టార్గెట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలన్నారు. 100 శాతం మార్కులతో పూర్తి చేస్తామని మైండ్‌ని డెవలప్ చేసుకోవాలన్నారు. ఎస్సీస్టడి సర్కిల్ అందరికి కావల్సిన సౌకర్యాలు, శిక్షణ స్కిల్స్ మాత్రమే అందించగలుగుతాం కానీ మీరు ఫిజికల్, మెంటల్‌గా స్టాంగ్‌గా ఉండి సాధించాల్సింది అయితే మీరే ఇది మీకు ఒక సువర్ణావకాశంలా భావించి శిక్షణ పొందాలన్నారు.

అదే విధంగా సీపీ శ్వేత మాట్లాడుతూ… ఫిజికల్ పరీక్షలు దగ్గరలో ఉన్నవి. ఎలా ప్రిపేర్ కావాలి అనే భయాలను ముందు మర్చి పోవాలన్నారు. ఇప్పటి నుండి క్రమంగా మంచి క్రమశిక్షణతో కష్టపడితే తప్పకుండా సాధించగలుగుతారన్నారు. మీ ఫిజికల్ పరీక్షల అడ్మిట్ కార్డులో వచ్చిన తేదిల ఆదారంగా మిమ్మల్ని గ్రూప్‌లుగా చేసి శిక్షణ అందిస్తామన్నారు. అందరు మారు మూల గ్రామాల్లో నుండి వచ్చి కష్టపడ్డ యువతులు కావునా కష్టం అయిన సరే ఇష్టంగా బావించి ఓరియెంటేషన్ టెక్నిక్ నేర్చుకొని మీ శారీరక శ్రమ ఫలితంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్, సభ్యులు, అభ్యర్ధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News