Monday, April 7, 2025

ఫలించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషి

- Advertisement -
- Advertisement -

 

మెదక్: ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషి ఫలించింది. మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా నుంచి దాయరరోడ్డు నిర్మాణం కోసం 7.80కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 73.72 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి 164.22కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి దాయర వరకు 2.50 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, జిల్లా మంత్రి హరీష్‌రావుకు, రోడ్లు, రహదారుల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News